తన గౌరవం కాపాడుకోవడానికి జగన్ ను విమర్శించినా జగన్ మీద ఉండవల్లికి ప్రేమ తగ్గదు.
దీనిని ఆయన తన ప్రతి ప్రెస్ మీట్లో ప్రూవ్ చేస్తారు. తాజాగా జగన్ పై అనేక విమర్శలు చేసినా…. చంద్రబాబును తప్పు పట్టకుండా ఉండవల్లి ప్రెస్ మీట్ ముగియదు అనేది తెలిసిందే.
అందులో భాగంగా చంద్రబాబు అసెంబ్లీని బాయ్ కాట్ చేయడాన్ని గట్టిగా తప్పు పట్టిన ఉండవల్లి… దానికి అసలు కారణం వైసీపీ అని ప్రస్తావించినా దానిని స్ట్రాంగ్ గా చెప్పలేకపోయారు.
వైసీపీ వాళ్లు సబ్జెక్ట్ మాట్లాడకుండా సీనియర్ నేతకు గౌరవం ఇవ్వకుండా అసెంబ్లీలో బూతులు మాట్లాడితే ఎవడు మాత్రం సహిస్తాడు. ఈ మాత్రం ఉండవల్లికి తెలియదా? తెలుసు.. కానీ ఎంతో కొంత సేవ్ చేయాలి కదా జగన్ ని… కానీ సబ్జెక్టులేమో అన్నీ జగన్ కి వ్యతిరేకంగా ఉన్నాయి.
ఇక తప్పక కొన్ని సార్లు జగన్ ని తిట్టాడు ఉండవల్లి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పాలనలో పూర్తిగా విఫలమయ్యారని చెప్పారు. మరీ ఇంతగా విఫలమవుతారని నేను అనుకోలేదని అన్నారు.
రెండేళ్లలోనే వైసీపీ సర్కారు రూ.3.50 లక్షల కోట్ల అప్పులు చేసిందని అన్నారు. సర్కారుకి అప్పులపై నియంత్రణ లేకుండాపోయిందని ఉండవల్లి వ్యాఖ్యానించారు.
ఏపీ ఎంత దారుణమైన ఆర్థిక స్థితికి దిగజారింది అంటే.. చంద్రబాబు కాదు, అమెరికా ప్రెసిడెంటును తెచ్చి సీఎం చేసినా దీనిని బాగు చేసే అవకాశమే కనిపించడం లేదన్నారు.చంద్రబాబు తాను సీఎం అయ్యి అసెంబ్లీకి వస్తాను అన్నారు. అయితే, ముందు చంద్రబాబు సీఎం అయ్యాక ఏం చేస్తారో ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలన్నారు.
మరోవైపు మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకుంటామనడం సర్కారు వైఫల్యమే, మళ్లీ కొత్త బిల్లు పెడతామని అనడం అసమర్థత అన్నారు. ప్రతిపక్ష పార్టీల సలహాలు తీసుకున్న ప్రభుత్వాలకే పేరొస్తుందని జగన్ గుర్తించడం లేదన్నారు.
రాష్ట్రంలో ప్రతిపక్షాన్ని లేకుండా చేయాలనుకోవడం అవివేకం అని… ప్రజలు ఎవర్ని గెలిపించినా వారు ఎపుడూ ప్రతిపక్షాన్ని ప్రేమిస్తారని అన్నారు.
ఎన్టీఆర్ కుమార్తెల గురించి ఏనాడూ పుకార్లు వినలేదు
భువనేశ్వరిపై కామెంట్ల గురించి ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. ఎన్టీఆర్ కుమార్తెల నేను ఎపుడూ ఏ చెడ్డ వార్తలు వినలేదు.నాకు హరికృష్ణ, పురందేశ్వరిలతో పరిచయం ఉంది. వారిద్దరు చాలా మంచివారు.
తెలుగుదేశం అధినేత చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకోవడం డ్రామా కాదు. తన పార్టీ నేతలు ప్రతిపక్ష నేతను అలా తిడుతుంటే జగన్ ఏం చేస్తున్నారని, వారిని ఎంకరేజ్ చేయడం పూర్తిగా జగన్ తప్పే అన్నారు ఉండవల్లి. వైసీపీ మంత్రులు విపక్ష నేతలను, ఇతర మనుషులను గౌరవించడం నేర్చుకోవాలని ఉండవల్లి అన్నారు.