అధికారంలోకి వచ్చాక చూద్దాం… ఇపుడైతే ఏదో ఒక హామీ ఇచ్చేద్దాం అని జగన్ ఇచ్చిన హామీలు ఆయన కొంపముంచుతున్నాయి.
జగన్ నవరత్నాలు ఇపుడు ప్రభుత్వాన్ని అప్పుల పాలు చేశాయి. ముఖ్యంగా నవరత్నాలు అమలు చేయడం జన్మలో సాధ్యం కాదని అంటున్నారు.
ఎందుకంటే మద్య నిషేధం నవరత్నాల్లో ఒకటి. ఇపుడు ప్రభుత్వం నడుస్తున్నదీ దానిపైనే. జగన్ ఆయన అనుచరులు వ్యక్తిగతంగా సంపాదించుకోగలుగుతున్న దానిపైనే. అంటే మధ్య నిషేధం కనుక చేస్తే పార్టీతో పాటు ప్రభుత్వం కూడా కూలిపోతుంది.
అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత, దశలవారీ నిషేధానికి మార్చారు. హడావుడి కోసం YSRCP ప్రభుత్వం ప్రారంభంలో కొన్ని దుకాణాలను తగ్గించింది.
2024 నాటికి ఫైవ్ స్టార్ హోటళ్లలో మాత్రమే మద్యం లభించే వరకు ప్రతిచోటా తగ్గింపు కొనసాగుతుందని చెప్పారు. అయితే, అది ఇప్పుడు దానికి తిలోదకాలు ఇచ్చారు. సరికదా ఇపుడు దుకాణాలు సంఖ్య, అమ్మకాల సంఖ్య టార్గెట్లు పెట్టి మరీ పెంచుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం 2021-22 కోసం కొత్త మద్యం పాలసీని ప్రకటించింది. గత సంవత్సరం అనుమతించిన 2934 వైన్ షాపులను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎలాంటి తగ్గింపు లేదని స్పష్టం చేసింది.. దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
మద్యం అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం పెట్రోలియం ఉత్పత్తులపై వ్యాట్‌తో పాటు ఏ ప్రభుత్వానికైనా అత్యంత ముఖ్యమైన ఆదాయ వనరు. నగదు కొరత ఉన్న రాష్ట్రం ఈ ఆదాయాన్ని కోల్పోయే పరిస్థితి ఉండదు. ఏపీకి అసలు లేదు. అందుకే నవరత్నాల్లోంచి ఈ రత్నాన్ని తొలగించే ప్రయత్నం ముమ్మరంగా జరుగుతోంది.
ప్రతిపక్షంలో ఉంటూ వాగ్దానాలు చేయడం చాలా సులభం. హామీని మ్యానిఫెస్టోలలో పెట్టడం సులభమే. అమలు చేయడమే చాలా కష్టం.
‘మాట తప్పం మడమ తిప్పం’ అని ని చెప్పిన మొనగాళ్లు ఇపుడు ఏమంటారో మరి!