- అదనపు సిబ్బంది ఏరివేతకు రంగం సిద్ధం
- సర్కారీ ఉద్యోగాలపై పునఃసమీక్ష?
- ఇందుకోసం ప్రత్యేక విభాగం
- శాఖలవారీగా ‘పని’పై అధ్యయనం
- గ్రామ సచివాలయ ఉద్యోగులు మినహా
- కొత్త నియామకాలు చేపట్టని జగన్
- 20 నెలలైనా వార్షిక క్యాలెండర్ ఏదీ?
నవ్యాంధ్రలో కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాలు రానట్లేనా..? ఉన్నవాటినీ తొలగించేందుకు జగన్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందా..? వివిధ ప్రభుత్వ శాఖల్లో రిటైర్మెంట్లే తప్ప.. కొత్త కొలువులు ఉండవా..? దాని తాజా కదలికలు చూస్తుంటే నిజమేననిపిస్తోంది.
జగన్ గద్దెనెక్కి 21 నెలలు గడచిపోయాయి. గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగాలు తప్ప ఇతర కొలువుల భర్తీని ఆయన పట్టించుకోలేదు. పార్టీ, రాజకీయ అవసరాల కోసం మాత్రం గ్రామ/వార్డు వలంటీర్లను నియమించుకున్నారు.
యువతను వీటితోనే సరిపెట్టుకోవాలని చెబుతున్నట్లు కనిపిస్తోంది. అంటే ప్రభుత్వ ఉద్యోగమంటే వైసీపీ సేవలో తరించడమేనన్న విధంగా వ్యవహరిస్తోంది. ఇక ఉద్యోగ నియామకాలకు పూర్తిగా స్వస్తి పలికే దిశగా అడుగులు వేస్తోంది.
ప్రభుత్వ ఉద్యోగాల పునఃసమీక్ష కోసం ప్రత్యేక విభాగం (స్టాఫ్ రివ్యూ కమిటీ) ఏర్పాటు చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు? అంతమంది అవసరమా? అదనంగా ఉన్న వారిని ఎక్కడైనా సర్దుబాటు చేయవచ్చా? ఏ విభాగాల్లో ఎక్కువ పని ఉంది? ఎక్కడ తక్కువ పని ఉంది? ఇలాంటి వివరాలన్నీ సేకరించి, అధ్యయనం చేసి ఈ కమిటీ నివేదిక ఇవ్వాలి. దాని ఆధారంగా నిర్ణయం తీసుకోనుంది.
నాడు గిర్గ్లానీ కమిటీ..
1990ల్లో ప్రభుత్వ కార్యాలయాల్లోకి కంప్యూటర్లు వచ్చాయి. పని సులభతరమైంది. దీంతో ఆఫీసుల్లో ఇంత మంది ఉద్యోగులు అవసరమా అనే ప్రశ్న దేశవ్యాప్తంగా ప్రభుత్వాల్లో మొదలైంది. అదే సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో స్టాఫ్ రివ్యూ కమిటీ (ఎస్ఆర్సీ) ఏర్పాటు చేశారు.
రిటైర్డ్ ఐఏఎస్ అధికారులైన గంగోపాధ్యాయ చైర్మన్‌గా.. గిర్‌గ్లానీని కన్వీనర్‌గా నియమించారు. తర్వాత కొన్నాళ్లకు వ్యక్తిగత కారణాలతో గంగోపాధ్యాయ వైదొలిగారు. గిర్‌గ్లానీయే ఏకసభ్య కమిటీలా వ్యవహరించారు. అన్ని శాఖల నుంచి ఉద్యోగుల సమాచారం తెప్పించుకున్నారు.
రెగ్యులర్ సిబ్బంది ఎందరు, ఔట్‌సోర్స్/కాంట్రాక్ట్ సిబ్బంది ఎందరు, వారిపై పనిభారం ఎలా ఉందనే అంశాలపై విస్తృతంగా అధ్యయనం చేశారు. మొత్తంగా రాష్ట్రంలో 1.25 లక్షల మంది ఉద్యోగులు అదనంగా ఉన్నారని తేల్చారు. ఇది అప్పట్లో సంచలనం సృష్టించింది. అదనంగా ఉన్న వారందరినీ తొలగిస్తారనే భయాందోళనలు మొదలయ్యాయి.
అయితే… ఏ ఒక్కరినీ ఉద్యోగాల నుంచి తొలగించబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ రిటైరైన వారి స్థానంలో కొత్తవారిని నియమించడం ఆగిపోయింది. టీచర్లు, పోలీసులు, వైద్య సిబ్బంది వంటి కీలకమైన, తప్పనిసరి శాఖల్లో తప్ప.. ఇతరత్రా నియామకాలను నిలిపివేస్తూ నెమ్మది నెమ్మదిగా… ఉద్యోగుల సంఖ్యను తగ్గించేశారు.
ప్రస్తుతం నవ్యాంధ్రలో ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల్లో దాదాపు 6 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో లక్షకు పైగానే ఖాళీలున్నట్లు అంచనా. అవసరమైనచోట కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బందిని నియమించి పనులు జరిపించుకుంటున్నారు.
ఉద్యోగాల భర్తీకి వార్షిక కేలండర్ తెస్తామని ముఖ్యమంత్రి జగన ప్రకటించి ఏడాది పూర్తవుతోంది. అయినా ఇప్పటివరకు అతీగతీ లేదు. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ ఉద్యోగాల పునఃసమీక్ష కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయడం గమనార్హం. దీనిపై ఇటు నిరుద్యోగుల్లో, అటు ఉద్యోగ సంఘాల్లో ఆందోళన మొదలైంది.
ఇప్పటికే అటకెక్కిన కొలువులు
జగన్ సర్కారు వచ్చిన తర్వాత 1.37 లక్షల మంది గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులను నియమించింది. దీనినే తమ ఘనతగా ప్రభుత్వ ప్రకటనల్లో చాటుకుంటోంది. ఇతరత్రా శాఖల్లో ఉద్యోగాల భర్తీకి సెలవు పలికింది.
సచివాలయ ఉద్యోగులకు ఈ ఏడాది అక్టోబరులో ప్రొబేషన ప్రకటించాల్సి ఉంది. దీంతో వారి జీతాల బడ్జెట్ భారీగా పెరుగుతుంది. ఇప్పటికే ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల చెల్లింపులకు నెలానెలా తలకిందులవుతోంది.
ఈ నేపథ్యంలో కొత్త నియామకాలకు మంగళం పాడినట్లేనని అంటున్నారు. ఇప్పుడు ఉద్యోగాల పునఃసమీక్ష విభాగం ఏర్పాటుతో ఒక పద్ధతి ప్రకారం కొత్త కొలువులకు స్వస్తి చెప్పబోతున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఆంధ్రలో లక్ష వైసీపీ వాలంటీర్లకు ఉద్యోగాలు ఇచ్చి 20 లక్షలను ప్రత్యక్షంగా 40 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి కోల్పోయారు ! 60 లక్షల కుటుంబాలు రోడ్డున పడినట్టే !
— ????????.???????????????????????????????????? (@mahesh88899) October 13, 2019
అయ్య @ysjagan గారు, విశాఖలో ఇద్దరు వ్యక్తుల గొడవలో గుండు గీస్తే 1 లక్ష రూపాయలు, ఉద్యోగం ఇవ్వడం ఏంటి కర్మ కాకపోతే.
మా ఊరిలో కూడా ఈరోజు ఒక గొడవ జరిగింది. వారికి కూడా ఇస్తారా?
డబ్బులు లేవు ఆంధ్రలో పాలనకు అని మళ్లీ ఇవ్వి ఏంటి అండి
ఉద్యోగాలు ప్రతిభావంతులకు ఇవ్వాలి కానీ పరిహారంగా కాదు— దినేష్(Dinesh) (@MeDineshh) August 30, 2020
ఆంధ్రలో కొత్త ఉద్యోగాలు……..
రండి బాబూ రండి……
అర్హత….
వైసీపీ కార్యకర్త
ముఖ్యంగా నాయకులకు ఉండే లక్షణాలు ఉండాలి..@PawanKalyan @JanaSenaParty @TrendPSPK @bolisetti_satya pic.twitter.com/ZWb52fryzM— Chinta S Kumar Jsp (@SureshKChJsp) August 28, 2020