జేబులోంచి రూపాయి ఖర్చుపెట్టకుండా కరుణామయుడు అని ఎలా అనిపించుకోవాలో జగన్ ను చూసి నేర్చుకోవాలి. కానీ ఇటీవల ఆయన రహస్యాలు బయటపడుతున్నాయి. అతని గురించి అర్థమయ్యాక ఒక్కో వర్గం అలర్ట్ అవుతున్నాయి.
అమరావతిని కడతాం అంటే చంద్రబాబు రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు అని పచ్చి అబద్ధాలతో ఆరోపణలు చేసింది వైసీపీ. కానీ నేడు నేరుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టేసింది.
వైసీపీ వారి భూములు ఎక్కువ ధరకు సేకరించడం ప్రజల్లో తమ సానుభూతిపరులకు ఉచితంగా పంచిపెట్టడం. ఈ క్రమంలో గవర్నమెంటు సొమ్ము కొంత స్వాహా.
ఇంకోపథకం మధ్యతరగతి కోసం టౌన్ షిప్ లు. ప్రభుత్వమే లాండ్ కొని లే అవుట్ వేసి ప్లాట్లు అమ్ముతుంది. ఇది సాధారణంగా ప్రైవేటు వ్యక్తులు చేసే పని. కానీ నేరుగా ఏపీలో ప్రభుత్వమే చేస్తోంది.
అయితే, వీటికి కడప, చిత్తూరు, నెల్లూరు వంటి రెడ్లు అధికంగా ఉన్న కొన్ని చోట్ల స్పందన వచ్చింది. కానీ మిగతాచోట్ల శూన్యం. దీంతో అసలే లోటు బడ్జెట్ తో ఉన్న సర్కారుకు కొంచెం ఇబ్బంది అయ్యింది. దీంతో ఏపీ సర్కారు కొత్త ఐడియా వేసింది.
ప్రైవేటు వ్యక్తులు భూములు కొని ప్రభుత్వానికి ఇస్తే ప్రభుత్వం వాటిని అమ్మిపెడుతుంది. పీపీపీ మోడల్. అయితే PPP మోడ్‌లో ప్రాజెక్ట్‌లను అమలు చేయడానికి ఇది రియల్ ఎస్టేట్ వ్యాపార యజమానులను ఆహ్వానించింది. తొలిదశలో ఏడు మున్సిపాలిటీల్లో 14 చోట్ల టౌన్‌షిప్‌లు ఏర్పాటు చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు 20 ఎకరాలకు తక్కువ కాకుండా భూమి ఉన్నందున ముందుకు రావాలన్నారు. అయితే రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎక్కడా ఒక్క దరఖాస్తు కూడా లేదు.
ఇక్కడ రెండు విషయాలు గమనించాలి. మొదటిది, ఎవరూ ప్రభుత్వంతో వ్యాపారం చేయడానికి అనుకూలంగా లేరు. ప్రభుత్వం తమ వద్ద నుంచి భూములు తీసుకుని, చాలా కేసుల మాదిరిగా తిరిగి డబ్బులు బదిలీ చేయకపోతే మా పరిస్థితి ఏంటని భయపడుతున్నారు. దీంతో ఎవరూ దీనికి దరఖాస్తు చేసుకోలేదు.
చివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ మద్దతు వ్యాపారులు కూడా ఇదే అభిప్రాయంతో ఉండడంతో వారు పాల్గొనలేదు అని అర్థమవుతుంది. ఏకంగా 20 ఎకరాల భూమిని కొనుగోలు చేసి ప్రభుత్వానికి ఇవ్వడం అంత సులువు కాదు. అది పెద్ద రిస్క్. విశ్వసనీయతకు బ్రాండ్ గా చెప్పుకునే జగన్ రెడ్డికి ఈ విషయం అర్థమవుతోందా మరి?