పెదప్రజలకు #క్యాన్సర్ సేవలు ఉచితంగా అందించాలని ధ్యేయం తో నెలకొల్పిన ఆస్పత్రి #బసవతారకం ఇండో అమెరికన్ ఆసుపత్రి. దీనికి#హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ ఛైర్మన్ గా ఉన్నారు.
ఎందరినో సామాన్యులకు కేన్సర్ నుంచి విముక్తి కలిగించిన ఆస్పత్రి బసవతారకం ఆస్పత్రి. తాజాగా ఈ ఆస్పత్రికి ప్రత్యేక గుర్తింపు దక్కింది. బసవతారకం ఆస్పత్రి సేవలు అమోఘం అని నీతి అయోగ్ కొనియాడింది. అలాగే పుట్టపర్తి సత్యసాయి ఆస్పత్రికి ఇదే గుర్తింపును ఇచ్చింది.
భారత ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో ప్రణాళికా సంఘం స్థానంలో 2015 జనవరి 1 ఏర్పడిన సరికొత్త వ్యవస్థ నీతి ఆయోగ్. … భారత్ లోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు దీని పాలకమండలిలో సభ్యులుగా ఉంటారు. ఇలాంటి సంస్థ మన ప్రాంతంలో అన్న నందమూరి తారక రామారావు నెలకొల్పిన ఈ ఆస్పత్రిని కీర్తించడం విశేషం.
ఆ నివేదికలో మరో అద్భుతమైన విషయాన్ని నీతి అయోగ్ పేర్కొంది. #బసవతారకం ఆసుపత్రి లాభాలు చూసుకోదు..వాటి విరాళాలకు వంద శాతం పన్ను మినహాయింపునివ్వాలి ..ప్రభుత్వాల నుంచి రీఎంబర్స్మెంట్ వేగంగా అందించాలి అని నీతి ఆయోగ్ నివేదికలో ప్రస్తావించడం విశేషం.
తెలుగురాష్ట్రాల్లో లాభాపేక్ష లేకుండా బసవతారకం ఇండో అమెరికన్ కేన్సర్ ఆసుపత్రి మెరుగైన వైద్యం అందిస్తోందని @NITIAayog ప్రకటించడం ఎంతో ఆనందాన్నిచ్చింది. కేన్సర్ ట్రీట్మెంట్ కి అత్యాధునిక వైద్య సదుపాయాలతో ఆసుపత్రి ఉండాలన్న స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి ఆశయం నెరవేరి..(1/2) pic.twitter.com/M7PPFno8td
— Lokesh Nara (@naralokesh) June 30, 2021