వివేకానందరెడ్డి కేసులో సంచలన నిజాలు బయటకు వచ్చాయి. కొత్తగా ఎంపీ అవినాష్ రెడ్డి పేరు కూడా బయటకు రావడం సంచలనం అవుతోంది. ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, గుజ్జుల ఉమాశంకర్‌రెడ్డితో కలిసి వివేకాను హత్య చేసినట్టు దస్తగిరి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చారు.
వివేకా హత్య కేసులో నిందితుడు దస్తగిరి ఇప్పటికే అప్రువల్ గా మారి అనేక వివరాలు వెల్లడించారు. వివేకా హత్యకు ఎర్రగంగిరెడ్డి స్కెచ్ గీశాడుని 40 కోట్లతో డీల్ తో మర్డర్ జరిగందని దస్తగిరి వెల్లడించాడు. ఎర్రగంగిరెడ్డి , సునీల్ కుమార్ యాదవ్ , ఉమాశంకర్ తో కలిసి హత్య చేసినట్లు తెలిపిన దస్తగిరి స్పష్టంచేశారు.
ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఎంపీ అవినాష్‌రెడ్డి పేరును దస్తగిరి ప్రస్తావించడం గమనార్హం.సీఆర్పీసీ 164(1) సెక్షన్ కింద ప్రొద్దుటూరు కోర్టులో ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్ రికార్డు చేశారు. హత్యలో నలుగురు పాల్గొన్నట్టు నిందితుడు దస్తగిరి వెల్లడించాడు.
వివేకా హత్యకు ఎర్ర గంగిరెడ్డి ప్లాన్ చేశాడట. బెంగళూరు ల్యాండ్ వివాదంలో వాటా ఇవ్వకపోవడంపై ఆగ్రహంతో ఎర్ర గంగిరెడ్డి రగిలిపోయినట్లు చెబుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గంగిరెడ్డి మోసం చేశారని, మీ సంగతి తేలుస్తానంటూ గంగిరెడ్డి, అవినాష్‌లకు వివేకా వార్నింగ్ ఇచ్చినట్టు కన్ఫెషన్ స్టేట్మెంట్ దస్తగిరి పేర్కొన్నారట.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తర్వాత అవినాష్ ఇంటి దగ్గర వాగ్వాదం జరిగిందని ఈ స్టేట్మెంట్లో తెలిపారు. తనను కావాలనే ఓడించారని, మీ కథ తేలుస్తానంటూ అవినాష్‌రెడ్డి, భాస్కరరెడ్డి, డి.శంకర్‌రెడ్డిలకు వివేకా వార్నింగ్ ఇచ్చినట్లు కన్ఫెషన్ స్టేట్మెంట్లో పేర్కొన్నారట.
ఈ నేపథ్యంలో వివేకాను హత్య చేసి ప్లాన్ చేశారట. దస్తగిరి కన్ఫెషన్ స్టేట్మెంట్ను మిగతా నిందితుల లాయర్లకు కోర్టు పంపించడం గమనార్హం.ఈ కేసులో తదుపరి ఏం జరుగుతుందో చూడాలి.
పూర్తి వివరాలు కింద వీడియోలో వివరంగా చూడొచ్చు.
నమస్తే ఆంధ్రలో వచ్చే ఆసక్తికరమైన అప్ డేట్ల కోసం ఇక నుంచి మీరు గూగుల్ న్యూస్ లో నమస్తే ఆంధ్రను ఫాలో అవ్వచ్చు.
https://news.google.com/publications/CAAqBwgKMIOpqwswgLTDAw?ceid=IN:te&oc=3