సాధారణంగా కొత్త ఏడాది నుంచి కొత్త రూల్స్ వస్తుంటాయి. నూతన సంవత్సరంలో కొత్త నిబంధనలు అమలులోకి తెచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తుంటాయి. అయితే, కరోనా కారణంగా ఈ సారి ఫిబ్రవరి 1నుంచి కొన్ని కొత్త రూల్స్ అమలులోకి రాబోతున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరిపై ఎంతో కొంత ప్రభావం చూపేలా కొన్ని విషయాలు మారబోతున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి మారబోతోన్న 9 అంశాలేమిటో ఓ లుక్కేద్దాం రండి.
1. ఫిబ్రవరి 1 నుంచి నాన్ ఈఎంవీ ఏటీఎం మెషీన్ల నుంచి పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్లు డబ్బులు విత్డ్రా చేసుకోవడం కుదరదు.
2. ప్రతినెల మొదటి తారీఖున సిలెండర్ ధర మారుతుంది. అలాగే ఫిబ్రవరి 1న గ్యాస్ సిలిండర్ ధర ఎంత పెరిగింది…అన్నది తెలుసుకోవాలి.
3. ఫిబ్రవరి 15 నుంచి వాహనాలన్నింటికీ టోల్ గేట్ రుసుము చెల్లించేందుకు ఫాస్టాగ్స్ తప్పనిసరి చేశారు.
4. ఫిబ్రవరి 1 నుంచి ఈ-కేటరింగ్ సర్వీసులు ప్రారంభిస్తున్నట్టు ఇండియన్ రైల్వేస్ కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ప్రకటించింది.
5. ఫిబ్రవరి 1 నుంచి సినిమా హాల్స్ అన్ని ఫుల్ కెపాసిటీతో నడిచేందుకు కేంద్రం అనుమతినిచ్చింది.
6. పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఫిబ్రవరి 1 నుంచి స్కూల్స్, కాలేజీలను తెరవడానికి అనుమతులు ఇచ్చాయి.
7. సబ్ అర్బన్ ట్రైన్ సర్వీసులకు మహారాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.
8. కేంద్ర ప్రభుత్వం నుంచి పెన్షన్ పొందే వారు ఫిబ్రవరి నెల చివరి లోపు జీవన్ ప్రమాణ్ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.
9. ఫిబ్రవరి 1 నుంచి అందరూ డిజిటల్ ఓటర్ కార్డులను ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు.