రానున్న కాలంలో చాలా మార్పులు రావొచ్చు అని యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్నటి వేళ సంకేతాలు ఇచ్చారు.ముందుగానే చెప్పాను కదా! రెండున్నరేళ్ల తరువాత ఈ క్యాబినెట్ ఉండదు అని! అయినా మీరు అధికారం అందుకుని మూడేళ్లు అయిపోయింది.కొన్ని మార్పులు తప్పవు అంటూ జగన్ మోహన్ రెడ్డి నర్మగర్భంగానే కొన్ని వ్యాఖ్యలు చేశారు.
ఇప్పటికే టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జీలను నియమించి వాళ్లకే భవిష్యత్ లో ఎమ్మెల్యే టిక్కెట్లు ఇస్తామని స్పష్టంగా చెబుతోంది. అదేవిధంగా జగన్ కూడా జిల్లా అధ్యక్షులుగా మంత్రులను నియమించాలని స్పష్టమయిన ఆలోచనకు వచ్చారు.రానున్న కాలంలో పొలిటికల్ ఎఫైర్స్ వింగ్ ను బలోపేతం చేయనున్నారు.
ఎన్నికల ముందు కొన్ని పథకాలు ఆపి కొన్ని పథకాలు కొత్తగా ఆరంభించే అవకాశాలు కూడా ఉన్నాయి. పొరుగు రాష్ట్రంలో అమలవుతున్న దళిత బంధు పథకాన్నే పేరు మార్చి ఇక్కడ అమలు చేస్తే ఎలా ఉంటుంది అన్నది ఓ ప్రతిపాదన.
ఇక సచివాలయ ఉద్యోగుల జాబ్ రెగ్యులరైజేషన్ పై అదేవిధంగా ప్రొహిబిషన్ పిరియడ్ కన్ఫర్మేషన్ పై ఓ స్పష్టతకు రావాల్సి ఉంది కనుక వాటిని ముందు క్లియర్ చేస్తారు.తరువాత డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చే ఛాన్స్ ఉంది. అదేవిధంగా పోలీసు శాఖలో కానిస్టేబుల్ నియమాకాలకు కూడా సీఎం గ్రీన్ సిగ్నల్ ఇస్తారు.ఇవన్నీ కొత్త మంత్రులు వచ్చాకే జరిగే మార్పులు.
కొత్త మంత్రులు వచ్చే నాటికి కొన్ని ఫైళ్లను క్లియర్ చేయాల్సి ఉంది.అందుకే సీఎం వాటిపై కూడా దృష్టి సారిస్తారు. జూనియర్లను తప్పించేందుకు అవకాశాలు ఉన్నాయి కానీ ఇంత వేగంగాఅయితే ఆ నిర్ణయాలు వెలుగు చూడవు.
కనుక కొత్త మంత్రుల జాబితాలో పేరు ఎవరిది ఉన్నా కూడా జగన్ దే తుది నిర్ణయం కనుక ఇదంతా ఎన్నికల ముందు చేస్తున్న కూర్పు కనుక సీనియర్లకు అంతగా ఛాన్స్ ఉండకపోవచ్చు.