ఏపీలో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ను బదిలీ చేస్తూ.. కేంద్రం నిర్ణయం తీసుకుంది. వచ్చే ఎన్నిక లను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకుందనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే రాజ్యాంగ కో విదుడు, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సయ్యద్ అబ్ఉల్ నజీర్‌ను గవర్నర్‌గా నియమించింది. అయితే.. ఈ మార్పుపై ఓ వర్గం రాజకీయ నేతలు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. గవర్నర్ మార్పుతో సీఎం జగన్ కు కేంద్రం చెక్ పెట్టిందని అంటున్నారు.
ప్రస్తుతం సీఎం జగన్ అప్పులు ఎక్కువగా చేస్తున్నారని.. అదేసమయంలో ప్రతిపక్షాల గొంతు కూడా నొ క్కుతున్నారని.. రాజ్యాంగ విలువలను కూడా పాతరేస్తున్నారని.. ఈ క్రమంలోనే కేంద్రం జగన్‌కు చెక్ పెట్టేందుకు .. ఇలా.. గవర్నర్‌ను మార్చిందని అంటున్నారు. అయితే.. దీనిలో నిజం ఎంత? అనేది ఆస క్తిగా మారింది. ఎందుకంటే.. ఇప్పటికిప్పుడు బీజేపీ ఏం చేసినా.. తన స్వప్రయోజనం కోసమే చేస్తుంది. ఇదే నిజమని అనుకుంటే..ఏపీలో బీజేపీకి ఎలాంటి ఇబ్బంది లేదు.
పైగా బీజేపీ నాయకులు నిరసన వ్యక్తం చేస్తే.. అడ్డు పెట్టేందుకు.. చెప్పేందుకు కూడా పోలీసులు ఎలాం టి ఆంక్షలు విధించడం లేదు. సో.. బీజేపీ ఎదుగుదలకు అడ్డులేనప్పుడు.. ఎవరో పార్టీ కోసం.. బీజేపీ ఎం దుకు గవర్నర్‌ను మారుస్తుంది? అనేది కీలక ప్రశ్న. అదేసమయంలో ఒకవేళ గవర్నర్ మార్పుతో రాజ కీయాల్లో ఏమైనా మార్పులు వస్తాయా? అంటే.. అది కూడా కనిపించడం లేదని అంటున్నారు పరిశీలకు లు.
అప్పులు తీసుకోవడం.. లేదా సంక్షేమాన్ని అమలు చేయడం.. అనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండే అంశాలు. ఇవి కేవలం సీఎం మాత్రమే నిర్ణయించగలడు. ఇక, రాజధాని మార్పు.. అనేది ఎలానూ సుప్రీంకోర్టు పరిధిలో నే ఉంది. కాబట్టి కోర్టు తీర్పు మేరకు ఆయన ముందుకు సాగుతారు. మిగిలిన క్యాంపు కార్యాలయం మార్పు కూడా గవర్నర్ నిర్దేశించేది కాదు. కాబట్టి.. గవర్నర్ మార్పుతో పెద్దగా ఒరిగిపోయే ఇబ్బంది.. ప్రతిపక్షాలకు వచ్చే బూస్ట్ ఏమీలేదని అంటున్నారు పరిశీలకులు.