మూడు రాజధానులకు ప్రజలు అనుకూలమేనా? పోనీ.. రాష్ట్రం మొత్తం కాదు.. పాలనా రాజధాని ఏర్పాటు కు విశాఖ,, న్యాయరాజధాని ఏర్పాటుకు కర్నూలు, ఇక, శాసన రాజధానికే పరిమితం కావాలని భావిస్తున్న అమరావతి.. ఈ విషయంపై ప్రజలు ఏమంటున్నారు? అంటే.. అందరికీ తెలిసిందే. ఎవరి మానాన వారు ఉన్నారు. దీంతో వైసీపీ నేతల వ్యూహాలు ముందుకు సాగడం లేదు. ఈ క్రమంలోనే త్వరలోనే మూడు రాజధానుల సెంటిమెంటును మరింత రాజేసేందుకు.. వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.
దీనిలో భాగంగా.. త్వరలోనే మూడురాజధానులు ఏర్పాటు చేయనున్న ప్రాంతాల్లో భారీ ఎత్తున బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించింది. అయితే.. కర్నూలులో న్యాయరాజధాని విషయాన్ని పక్కన పెడితే .. విశాఖకు పాలనా రాజధానిని తీసుకువెళ్లడంపైనే.. అమరావతి ప్రజల అభ్యంతరం. ఈ క్రమంలోనే పాద యాత్ర చేస్తున్నారు. ఇది సెంటిమెంటుగా మారి.. రైతుల పట్ల సాధారణ ప్రజల్లోనూ సానుభూతి వ్యక్తమవు తోంది. దీంతో వైసీపీ ఇప్పుడు.. ప్రజలను నమ్మించేందుకు పక్కాగా ముందుకు సాగాలని నిర్ణయించింది.
ఈ క్రమంలో గతంలో రాజధాని కోసం.. ఏర్పాటు చేసిన.. శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికలోమూడు రాజధానులు ప్రస్తావించారని.. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే.. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందనే పిడివాదాన్ని ప్రజల్లో కి తీసుకువెళ్లేందుకు వైసీపీ ప్రభుత్వం రికార్డు స్థాయిలో ప్రయ త్నం చేయొచ్చని అంటున్నారు. వాస్తవానికి శివరామకృష్ణన్ కమిటీ.. ఇతమిత్థంగా ఇక్కడే రాజధాని ఏర్పాటు చేయాలని చెప్పేలేదని.. కూడా వైసీపీ ప్రచారం చేసే అవకాశం ఉంది.
ఈ క్రమంలోనే.. టీడీపీ కూడా అలెర్ట్ కావాలని మేధావులు సూచిస్తున్నారు. అవాస్తవాలను ప్రచారం చేసే లోగానే.. వాస్తవాలను ప్రజలకు వివరించాలని.. వారు సూచిస్తున్నారు. అసలు ఇప్పటి వరకు ప్రజల్లోకి ఈవిషయాలను టీడీపీ కానీ.. రాజధాని కోరుకునేవారు కానీ.. తీసుకు వెళ్లారా? అని ప్రశ్నిస్తున్నారు. ఒక్క బుక్లెట్ అయినా.. ప్రచురించి.. ఏది వాస్తవం.. ఏదికాదు.. అనేది ప్రజలకు వివరించారా? అని ప్రశ్నిస్తున్నారు. మరి ఇప్పటికైనా.. వైసీపీ దూకుడు కళ్లెం వేయాలంటే.. టీడీపీ పుంజుకోవా లని చెబుతున్నారు.