యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం `దేవర` సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. సుమారు ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్ నుంచి వచ్చిన ఈ సోలో మూవీ.. మిక్స్డ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల కురుపిస్తోంది. ఆ సంగతి పక్కన పెడితే.. ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో పట్టాలెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కెరీర్ లో 31వ చిత్రమిది. `ఎన్టీఆర్-నీల్` వర్కింగ్ టైటిల్ తో ఆగస్టులోనే లాంఛనంగా ఈ సినిమాను ప్రారంభించడం జరిగింది.
హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో గ్రాండ్ గా పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ రోజే 2026 జనవరి 9న ఎన్టీఆర్ 31 మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని ప్రకటించి ఫ్యాన్స్ లో జోష్ ను నింపారు. రెగ్యులర్ షూటింగ్ మరికొద్ది రోజుల్లో స్టార్ట్ కానుంది. అయితే తాజాగా ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ మూవీ స్టోరీకి సంబంధించి కొన్ని లీకులు తెరపైకి వచ్చాయి.
బంగ్లాదేశ్ బ్యాక్‌డ్రాప్‌లో ఎన్టీఆర్ 31 మూవీ స్టోరీ సాగుతుందట. పాన్ ఇండియా ప్రేక్షకులను రీచ్ అయ్యేలా కథను సిద్ధం చేశారట. బంగ్లాదేశ్‌కు వలస వెళ్లిన తెలుగు వాళ్లకు అండగా నిలిచే పాత్రలో ఎన్టీఆర్ కనిపిస్తాడని అంటున్నారు. తారక్ క్యారెక్టర్ ను ప్రశాంత్ నీల్ సరికొత్తగా మరియు డిఫరెంట్ గా డిజైన్ చేస్తున్నారని ఇన్సైడ్ బలంగా టాక్ నడుస్తోంది. అలాగే ఎన్టీఆర్ 31లో హీరోయిన్ ఎంపిక కూడా పూర్తైనట్లు వార్తలు వస్తున్నాయి. సప్తసరాగాలు దాటి సినిమాతో యూత్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న రుక్మిణి వసంత్ తారక్ కు జోడిగా అలరించబోతోందట.