వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ డర్టీ పిక్చర్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. అయితే గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో ఒరిజినలా లేక మార్ఫింగ్ చేసిందా అని ఫోరెన్సిక్ నిపుణులు నిర్ధారించక ముందే వైసీపీ నేతలు కొందరు తొందరపడి కామెంట్లు చేయడం వారిని ఇరకాటంలో పడేసినట్లయింది. తాజాగా ఆ వీడియో ఒరిజినల్ అని అమెరికాకు చెందిన ఫోరెన్సిక్ నిపుణుడు జిమ్ వెల్లడించడంతో వైసీపీ నేతల గొంతులో వెలక్కాయ పడ్డట్లయింది.
దీంతో, ఇప్పటిదాకా గోరంట్లకు మద్దతుగా మాట్లాడిన సజ్జల, రోజా వంటి నేతలను సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శిస్తున్నారు. అంతేకాదు, గోరంట్ల వీడియో ఫేక్ అంటూ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిన అనంతపురం ఎస్పీ ఫకీరప్పపై కూడా ట్రోలింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో వైసీపీ నేతలకు నెటిజన్లు కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నారు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి డర్టీ జే గ్యాంగ్ అంటూ ట్రోల్ చేస్తున్నారు.
ఫోరెన్సిక్ ల్యాబ్ కు వీడియో పంపించామని కొందరు వైసీపీ నేతలు చెబుతున్నారని, కానీ ఫోరెన్సిక్ ల్యాబ్ కు వీడియో వెళ్లినట్టు అధికారికంగా ఏ అధికారులు వెల్లడించలేదు ఎందుకు అని వారు నిలదీస్తున్నారు. దీన్నిబట్టి, రోజా, తానేటి వనిత, సజ్జల చెప్పింది అబద్ధమా అని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు, ఈ వీడియో పై గోరంట్ల తరఫునుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్పీ ఫకీరప్ప చెబుతున్నారు. కానీ దానిపై కంప్లైంట్ ఇచ్చాను అని మాధవ్ అంటున్నారు. ఈ రెండిట్లో ఏది నిజం అని నెటిజన్లు నిలదీస్తున్నారు.
ఈ వీడియో వ్యవహారానికి అత్యంత కీలకమైన గోరంట్ల మాధవ్ ఫోన్ ను ఇప్పటివరకు పోలీసులు ఎందుకు సీజ్ చేయలేదు? అని నెటిజన్లు నిలదీస్తున్నారు. చివరకు అమెరికాలోని ఫోరెన్సిక్ నిపుణులు అది ఒరిజినల్ వీడియో అని, ఎడిటింగ్ కానీ మార్ఫింగ్ కానీ చేయలేదని తెలిపారు. దీంతో, ఆ రిపోర్టు ఫేక్ అని కొడాలి నాని వంటి నేతలు నోరేసుకుని పడిపోవడం తప్ప ఆథెంటిక్ గా ఆ రిపోర్ట్ తప్పని వైసీపీ నేతలు ఎందుకు నిరూపించలేకపోతున్నారు. మరి, ఈ ప్రశ్నలకు వైసీపీ నేతలు ఏం సమాధానం చెబుతారన్నది ఆసక్తికరంగా మారింది.