కరోనా వైరస్ దెబ్బకు యావత్ ప్రపంచం చైనాను శతృవుగా చూస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కరోనా వైరస్ ను డ్రాగన్ కావాలనే ప్రపంచం మీదకు వదిలిందని కొందరి అభిప్రాయం. మరికొందరేమో కరోనా వైరస్ ప్రమాదం గురించి ప్రపంచానికి చైనా ముందుగా చెప్పనేలేదనేది మరికొన్ని దేశాల ఆరోపణ. సరే ఏదేమైనా కరోనా వైరస్ దెబ్బకు యావత్ ప్రపంచం అతలాకుతలమైపోతోంది.
ప్రపంచాన్ని మంచి చేసుకోవటానికో ఏమో ఇపుడు మాత్రం చైనా ప్రపంచాన్ని ముందుగానే హెచ్చరించింది. ఇంతకీ విషయం ఏమిటంటే కరోనా వైరస్ కన్నా ప్రమాదకరమైన వైరస్ ‘నియోకోవ్’ ను దక్షిణాఫ్రికాలో కనుక్కున్నట్లు వూహాన్ యూనివర్సిటిలోని సైంటిస్టులు ప్రకటించారు. దక్షిణాఫ్రికాలోని గబ్బిలాల్లో మొదట వైరస్ ను గుర్తించారట. అయితే అప్పట్లో అది కేవలం జంతువులకు మాత్రమే సోకుతుందని అనుకున్నారట.
కానీ తర్వాత అది జంతువుల నుండి జంతువులకు మాత్రమే కాదని మనుషులకు కూడా వ్యాపిస్తుందని బయటపడిందని శాస్త్రజ్ఞులు ప్రకటించారు. నియోకోవ్ వైరస్ ఎంత ప్రమాదకరమంటే ఇది సోకిన ప్రతి ముగ్గురిలో ఒకరు కచ్చితంగా చనిపోతారట.
అంతేకాకుండా కరోనా వైరస్ కన్నా అత్యంత స్పీడుగా సోకుతుందని కూడా శాస్త్రజ్ఞులు తేల్చారు. ఈ కొత్తరకం వైరస్ కు అధిక ప్రసార రేటు కూడా ఉందని వూహాన్ శాస్త్రజ్ఞులు చెప్పారు.
ఇపుడు వూహాన్ చేసిన ప్రకటన గురించి తమకు ముందే తెలుసని రష్యన్ స్టేట్ సెంటర్ ఆఫ్ వైరాలజీ నిపుణులు ప్రకటించారు. గ్రౌండ్ లెవల్లో జరుగుతున్నది చూస్తుంటే ఒకటి తర్వాత మరో వైరస్ ప్రపంచం మీదకు దండయాత్ర చేస్తున్నట్లుగానే ఉంది. మొదటి కరోనా వైరస్ ఇపుడు ఒమిక్రాన్ తొందరలోనే నియోకోవ్.
ఇంకెన్ని వైరస్ లను ప్రపంచం చూడాలో ఏమో ఖర్మ. నిపుణుల ప్రకటనలు చూస్తుంటే ఏదో ఒక వైరస్ తో యావత్ ప్రపంచం కనీసం మరో రెండు మూడేళ్ళు ఇబ్బంది పడక తప్పదేమో అనిపిస్తోంది.