ఆయన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే. టీడీపీకి చెందిన కీలక నేతను వరుసగా ఓడిస్తూ.. తాను వరుసగా గెలుస్తూ.. రికార్డులు సృష్టిస్తున్న ఆయన.. ఇప్పుడు వివాదాల్లోనూ అంతే రేంజ్‌తో రికార్డులు సొంతం చేసుకుంటున్నారు. తనకు మంత్రి పదవి ఇవ్వలేదని కొన్నాళ్లు అలిగి.. సొంత పార్టీలో తనకు మంత్రి పదవి ఇవ్వకుండా అడ్డు పడుతున్నారంటూ.. ఒకరిద్దరు ఎమ్మెల్యేలపై వివాదానికి దిగి.. రోడ్డున పడ్డ సదురు నాయకుడు ఇప్పుడు అడ్డగోలు దోపిడీకి తెరదీశారని.. నెల్లూలో చర్చ సాగుతోంది. అదికూడా వైసీపీలోనే సాగుతుండడం ఆశ్చర్యంగా ఉంది.
పైకి సౌమ్యంగా ఉండే సదరు ఎమ్మెల్యే.. లోలోపల మాత్రం వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు సాగుతు న్నారు. ధాన్యం కొనుగోళ్ల నుంచి రైస్ మిల్లింగ్ల వరకు.. చిన్న చిన్న కాంట్రాక్టుల నుంచి మైనింగ్ వరకు కూడా ఆయన దోపిడీకి అంతులేకుండా పోతోందని అంటున్నారు వైసీపీ నాయకులు. పైకి మాత్రం అంద రూ బాగానే ఉంటారు. కానీ.. ఏ ఇద్దరు పర్సనల్‌గా మాట్లాడుకున్నా కూడా సదరు ఎమ్మెల్యే విషయంపై మాత్రం నిప్పులు చెరుగుతున్నారు. తాజాగా టీడీపీ నాయకులు ఏకంగా ఈయనపై నిరసనకు, ఆందోళనకు కూడా రెడీ అయ్యారు.
సదరు ఎమ్మెల్యేగారి దోపిడీని అరికట్టాలంటూ.. కొన్ని ప్రాంతాల్లో ఫ్లెక్సీలు వెలవడం కూడా గమనార్హం. ఇక, ఎమ్మెల్యే విషయానికి వస్తే.. ఆయన కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వచ్చారు. అప్పటి నుంచి జగన్ కు విధేయుడిగా ఉండడంతోపాటు.. గత ఏడాది పార్టీ గెలిచి అధికారంలోకి రావాలని కూడా కోరుకున్నారు. అయితే… తాను ఆశించిన మంత్రి పీఠం దక్కలేదు. రెడ్డి సామాజిక వర్గం సమీకరణలో తనకు మంత్రి ఇవ్వాలని ఒత్తిడి చేసినా.. జగన్ మాత్రం స్పందించలేదు. దీంతో అటు పార్టీపై ఉన్న అక్కసు.. స్థానికంగా అదే రెడ్డి వర్గానికి చెందిన కొందరు తన పదవి విషయంలో అడ్డుపడ్డారనే కోపం కలగలిపి.. ఇప్పుడు రెచ్చిపోతున్నారని అంటున్నారు.
పైగా.. జగన్ తనను ఏమీ చేయలేరనే ధోరణిలోనూ ఉండడం గమనార్హం. దీంతో ప్రస్తుతం సదరు ఎమ్మెల్యే పరిస్థితి వివాదాస్పదంగా మారింది. ఇటీవల ఓ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన రైతు.. తాను ధాన్యం అమ్మగా రావల్సిన డబ్బుల కంటే ఎక్కువగా వచ్చాయంటూ.. కలెక్టర్‌కు పిర్యాదు చేసిన ఘటనలో ఈ ఎమ్మెల్యేదే కీలక పాత్ర అని.. ధాన్యం మాఫియా ఈయన కనుసన్నల్లోనే సాగుతోందని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇక, ఇప్పుడు మైనింగ్ ఆరోపణలు కూడా ఆయనను చుట్టుకోవడం గమనార్హం. మరి జగన్ ఏం చేస్తారో చూడాలి.