ఒక చిన్న మార్పు.. జీవితాలను మార్చేస్తుందని…నిర్లక్ష్యం నిండు ప్రాణాలను బలి తీసుకుంటుందని అంటారు. కానీ, అదే చిన్న మార్పు 18 మంది ఉసురు తీసిం ది. దీనికి రెట్టింపు సంఖ్యలో ప్రజలను ఆసుపత్రి పాల్జేసింది. తాజాగా శనివారం రాత్రి దేశ రాజధాని న్యూ ఢిల్లీలోని రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాట ఘోర విషాదానికి కారణం .. చిన్న `మార్పు`! రైల్వే శాఖ వ్యవహరిస్తున్న ఉదాశీన వైఖరి.. ప్రయాణికుల ప్రాణాలను హరించింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయా గ్రాజ్లో జరుగుతున్న మహా కుంభ మేళాకు వెళ్లేందుకు భారీ సంఖ్యలో ప్రజలు స్టేషన్‌కు తరలి వచ్చా రు.
సుదీర్ఘ క్యూలైన్లలో నిలబడి రైలు టికెట్లు కొన్నారు. ఇంతలో రైలుకు సంబంధించిన ప్రకటన వచ్చేసిం ది. మహాకుంభమేళాకు వెళ్లే.. ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్ 12వ నెంబరు ప్లాట్ ఫాంపైకి వస్తుందని ఎనౌన్స్ మెంటు వచ్చేసింది. దీంతో భారీ సంఖ్యలో ఉన్న ప్రయాణికులు.. హడావుడి హడావుడిగా .. ఆ ప్లాట్‌ఫాం పైకి చేరుకున్నారు. అయితే.. మరో 10 నిమిషాలు గడిచేసరికి.. అదే ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్ 14వ నెంబరు ప్లాట్‌ఫాంపైకి వస్తోందని.. `మార్పు`ను గమనించాలని మరో ప్రకటన వచ్చింది.
ఈ మార్పే ప్రయాణికుల ప్రాణాలు తీసింది. 14వ నంబరు ప్లాట్‌ఫాంపై ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్ నిలిచి ఉండడంతో భక్తులు హుటాహుటిన అక్కడకు చేరుకునే ప్రయత్నం చేశారు. వాస్తవానికి ఈ ప్లాట్ ఫాంపై స్వతంత్ర సేనాని, భువనేశ్వర్ రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లు రావాల్సి ఉంది. దీంతో ఆయా రైళ్లకు వెళ్లే వారే అప్పటికే అక్కడ పెద్ద ఎత్తున గుమిగూడి ఉన్నారు. వచ్చిన రైలు.. తమదేనని.. స్వతంత్ర సేనాని ఎక్స్‌ప్రెస్ ఎక్కేవారు.. ఎగబడ్డారు. అదేసమయంలో ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లేవారు కూడా.. ఒక్కసారి తోసుకుంటూ ముందుకు వచ్చారు.
మరీ ముఖ్యంగా రిజర్వ్డ్ కంపార్ట్మెంట్లకు కూడా సాధారణ ప్రయాణికులు పోటెత్తారు. దీంతో వందల సంఖ్య కాస్తా వేలకు చేరి.. తమకు సీటు లభిస్తుందో లేదో అన్న ఆందోళనలో ఒకరిపై ఒకరు తోసుకుం టూ.. రైలు పెట్టెలోకి ఎక్కే ప్రయత్నం చేశారు. ఇదే భారీ తోపులాటకు దారి తీసింది. ఈ ఘటనలో నే 18 మంది మృతి చెందారు. మరో 30 మందికి పైగా గాయపడ్డారు. “రైల్వే వాళ్లు.. ముందు 12 అన్నారు. తర్వాత 14వ నెంబర్‌కు మార్చారు. ఇది మాకు అర్ధం కాలేదు. అందుకే తోసుకుంటూ వెళ్లాం. మా వోళ్లు ఎక్కడున్నారో తెలియదు“ అంటూ.. ఓబాధితుడు కన్నీటి పర్యంతమయ్యారు. ఏదేమైనా.. ఒక చిన్న అనాలోచిత మార్పు.. ప్రాణాలు తీసింది.