నవ్యాంధ్ర రాజధాని అమరావతిని నిలబెట్టుకునేందుకు ఆ ప్రాంత రైతాంగం చేస్తున్న భారీ ఉద్యమానికి అండగా నిలుస్తున్న ప్రవాసాంధ్రులు ఇప్పుడు విభిన్నరీతిలో మరింత దన్నునందించేందుకు ముందుకు వచ్చారు.
ఆరు కోట్ల ఆంధ్రులారా… అరక దున్ను అమరావతి రైతులారా.. అమరావతి బిడ్డలారా.. దగాపడ్డ తమ్ములారా.. రగులుతున్న మహిళల్లారా.. బాధపడకండి.. వస్తున్నాం మీకోసం..చట్టానికి కళ్లుపీకి ధర్మానికి నోరునొక్కి సాగుతున్న దుర్మార్గం సాగదు ఇంకా ఎంతోకాలం! మీరు చేస్తున్న పోరాటాలకు మేము మీకు అండగా వుండబోతున్నాం.
అంటూ.. NRI’s For AMARAVATI పేరిట One state-One capital నినాదంతో వెబ్‌సైట్‌ను శనివారం ప్రారంభిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో అమరావతి గొంతు నులిమేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకుంటున్న రాజధాని రైతుల వాయిస్‌ను మరింత బలంగా వినిపించేలా… ఏపీ సర్కారు చేస్తున్న దాష్టీకాన్ని ప్రపంచానికి తెలియజెప్పేలా ఈ వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. అమెరికా కాలమానం ప్రకారం.. శనివారం(అక్టోబరు 31, 2020) ఉదయం 10.30గంటలకు ఈ వెబ్‌సైట్‌ను ప్రారంభించనున్నారు.
భారత కాలమానం ప్రకారం అదే రోజు రాత్రి 8.30 గంటలకు జరనుంది. జూమ్
యాప్ ద్వారా https://tinyurl.com/NRISFORAMARAVTI లో Meeting ID: 940 4082 9975, Passcode: 5599 ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు.
వెబ్సైట్ ప్రారంభకులు: శ్రీలక్ష్మి(అమరావతి ప్రాంత గృహిణి), కుక్కుమళ్ళ పిచ్చమ్మ(రైతు కూలీ, కృష్ణాయపాలెం)
కార్యక్రమానికి ముఖ్య అతిథులు:
శివారెడ్డి – AP JAC
తిరుపతిరావు – AP JAC
నెలకుదిటి మల్లికార్జునరావు – AP JAC, Guntur
రాయపాటి శైలజ, మహిళా జాక్
ఆలపాటి రాజేంద్రప్రసాద్ - Ex Minister(A.P)
వంగవీటి రాధా – Political Leader
సుంకర పద్మశ్రీ – Congress
గద్దె అనురాధ – TDP
ముప్పాళ్ల నాగేశ్వరరావు – CPI
బాబూరావు – CPM
అతిథులు
శ్యామ్ కిశోర్ జమ్ముల – రైతు సమాఖ్య
మాదాల శ్రీనివాస్ – రైతు సమాఖ్య
కొలికిపూడి శ్రీనివాసరావు – ఏపీ పరిరక్షణ సమితి
సుధాకర్ పువ్వాడ – రాజధాని రైతు పరిరక్షణ సమితి
మురళీధరరావు – అడ్వకేట్
శ్రావణ్‌కుమార్ – రిటైర్డ్ జడ్జి, జై భీమ్, బహుజన JAC
కొరివి వినయ్‌కుమార్ – దళిత బహుజన ఫ్రంట్
మెల్లం భాగ్యరావు – దళిత బహుజన ఫ్రంట్
బాలకోటయ్య – దళిత JAC
కంభంపాటి శిరీష – దళిత JAC
మాదాల రాజేంద్ర – రైతు
ధనేకుల రామారావు – రైతు
ప్రియాంక బండ్లమూడి – Women Activist
రాధిక పాతూరి – Women Activist