బీహార్ పై దేశం పెట్టుకున్న ఆశలు పెద్దగా వర్కవుట్ కాలేదు. బీహార్ మోడీకి మూడు చెరువుల నీళ్లయితే తాగించింది గాని చివరకు క్షమించి వదిలేసింది. భారీ రాజకీయ వ్యూహ ప్రతివ్యూహాలు పన్నినా చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు కేవలం ఒక్క స్థానం అధికంగా బొటాబొటి మెజారిటీతో బీహార్ పీఠం కైవసం చేసుకుంది.
నితీష్ కుమార్ కు చావు దెబ్బ తగిలింది. బీహార్ ఆడిన గేమ్ లో తేజస్వి పీఠం దక్కని విజేత కాగా, పీఠం దక్కించుకుని ఓడిపోయిన నేతగా నితీష్ మిగిలిపోయాడు. నితీష్ చివరి ప్రయత్నం కడు కష్టం మీద కుట్రలతో చేతికి దక్కింది.
బీహార్ మొత్తం తేజస్వి వైరల్ అయినా చివరకు హీరోగా నిలిచారు గాని పదవి మాత్రం దక్కలేదు. ఉదయం ఆర్జేడీ హవా కొనసాగి కాసేపు మోడీ బ్యాచ్ కి చుక్కలు చూపించిన తేజస్వి తర్వాత మెత్తబడ్డారు. బీహార్ అసెంబ్లీలో 243 స్థానాలు ఉండగా, మ్యాజిక్ ఫిగర్ 122 సీట్లు. జేడీయూతో కలిసి ఏర్పాటైన ఎన్డీయే కూటమి 123 స్థానాల్లో గెలిచింది. ఇంకా ఒక ఆధిక్యంలో ఉంది.
ఎవరెన్ని గెలిచారు
ఎన్డీయే బీజేపీ కూటమి – 122 సీట్లు ( 1+ ఆధిక్యం )
ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి – 108 స్థానాలు (3 + ఆధిక్యం)
ఇండిపెండెంట్లు – 7 స్థానాలు
ఎల్ జేపీ – 1 స్థానం