మీరు మళ్లీ మళ్లీ చదివినా మీరు చదివింది రైటే. మేము ఏ తప్పు రాయలేదు. పార్లమెంటులో లోక్ సభ, రాజ్యసభ రెండు విభాగాలు. లోక్ సభలో బీజేపీకి, ఎన్డీయేకి మంచి మెజారిటీ ఉంది. కానీ ఇంతకాలం రాజ్యసభలో వైసీపీ బలం బీజేపీకి అసవరం అయ్యింది. ఎందుకంటే ఎన్డీయే మొత్తం బలం కలిపినా ఎన్డీయేకి రాజ్యసభలో మెజారిటీ లేదు. దీంతో వైసీపీ మద్దతు బీజేపీకి అవసరం పడింది. కానీ ఇపుడు ఆ లెక్కలు తారుమారయ్యాయి.
రాజ్యసభలో మొత్తం సీట్లు 242.
మెజారిటీ కావాలంటే 122 సీట్లు కావాలి
ప్రస్తుతం బీజేపీ సీట్లు 104
ఎన్డీఏ పార్టీ బీజేడీ సీట్లు 9
ఏన్డీఏ పార్టీ అన్నా డీఎంకే బలం 9
ఎన్డీయేతో కలిపి బీజేపీకి అవసరమైన మెజారిటీ 122 ఇపుడు రాజ్యసభలో వచ్చేసింది. రాబోయే రోజుల్లో 2021 ముగిసేలోపు బీజేపీకే సొంతంగా రాజ్యసభలో మెజారిటీ రానుంది.ఈ కారణంగానే ఇంతకాలం జగన్ తో కాస్త మంచిగా ఉన్న బీజేపీ సర్కారు తాజాగా పాతిక రోజుల నుంచి టోన్ మార్చింది. దానికి కారణం ఇదే.
బీజేపీ చర్యలు చూస్తుంటే ఇక జగన్ కి పొలిటికల్ కటీఫ్ చెప్పినట్లే కనిపిస్తోంది. అందుకే వైసీపీ నేతల్లో ఆందోళన పెరిగింది.