హైదరాబాద్ మహానగర శివారులో చోటు చేసుకున్న నవీన్ రెడ్డి లవ్.. ఎంగేజ్ మెంట్.. కిడ్నాప్ ఉదంతానికి సంబంధించి ట్విస్టుల మీదే ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. తొలుత దాడి.. కిడ్నాప్ ఉదంతం తెర మీదకువస్తే.. ఆ తర్వాత వాళ్లిద్దరు పాత ప్రేమికులు.. తండ్రి బెదరింపులతో నవీన్ రెడ్డి వద్దకు వెళ్లిపోయిందన్న వాదనలు వినిపించటం.. దానిని బాధితురాలి తండ్రి ఖండించటం తెలిసిందే. తాజాగా నవీన్ రెడ్డి తల్లి బయటకు వచ్చారు.
ఎవరికి వారు వారి వెర్షన్లు చెప్పటం.. ఇందులో నిజం ఏమిటన్నది ఇప్పుడో ప్రశ్నగా మారింది. ఇలాంటి వేళ.. కిడ్నాప్.. దాడి ఉదంతంలో పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటున్న నవీన్ రెడ్డి.. వారి కుటుంబం. ఇలాంటి వేళ.. నవీన్ తల్లి మీడియాతో మాట్లాడుతూ.. తన కొడుకు కోసం బాధితురాలిగా చెబుతున్న మహిళ కోడలిగా ఇంటికి వస్తానంటే ఇప్పటికి తాను అంగీకరిస్తానని చెప్పుకొచ్చారు.
నవీన్ – వైశాలి మధ్య ప్రేమ వ్యవహారం రెండేళ్లుగా నడుస్తుందన్నారు. తన కొడుకును ఎప్పుడు అడిగినా బయటే ఉన్నట్లు చెప్పేవాడని.. అలాంటిది ఇప్పుడు ఆ అమ్మాయి అలా ఎందుకు మారిందో తనకు తెలీటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వైశాలి వాళ్లు అద్దె ఇంట్లో ఉన్నప్పుడు తమ ఇంటికి వచ్చిందని.. తన కొడుకు కోసం వైశాలి వస్తానంటే ఆమెను తన కోడలిగా అంగీకరిస్తానని పేర్కొంది.
‘నా కొడుకును ఆర్థిక అవసరాల కోసం వాడుకున్నారు. వారిద్దరూ భార్యభర్తల్లా బయట తిరిగారు. పెళ్లి కూడా చేసుకన్నారు. నవీన్ ను మోసం చేశారు’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తన కొడుకును అన్యాయం చేశారన్న ఆమె.. మీడియాతో మాట్లాడుతూ సొమ్మసిల్లి పడిపోయారు. నవీన్ తల్లికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయని.. కొడుకు గురించి పోలీసులు వెతుకుతున్నారన్న వార్త తెలిసినంతనే బీపీలో మార్పులతో ఆమె సొమ్మసిల్లి పడిపోయినట్లుగా పేర్కొన్నారు.
నవీన్ తల్లి వారిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం జరిగిందని చెబుతుంటే.. మరోవైపు వైశాలి కుటుంబ సభ్యులు మాత్రం అలాంటిదేమీ లేదని.. ప్రేమ పేరుతో నవీన్ తమ కుమార్తెను వేధించినట్లుగా పేర్కొంటున్నారు. ఈ మొత్తం విషయం మీద అసలు ఏం జరిగిందనే విషయం మీద పోలీసులు అన్ని కోణాల నుంచి ఆరా తీస్తున్నారు.
ఎవరీ మిస్టర్ టీ నవీన్ రెడ్డి… వైశాలిని ఎందుకు కిడ్నాప్ చేశాడు..?
|| ABN Digital#Hyderabad #AdibatlaKidnapCase #Kidnapped #Vaishali #mrteanaveenreddy #Viral #ABNDigital pic.twitter.com/pDxjNxjkSB— ABN Telugu (@abntelugutv) December 10, 2022