ఆంధ్ర్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 24 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ ఎన్నికల్లో టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి 175 శాసనసభ స్థానాలకు 164 స్థానాలు గెలుచుకుని చారిత్రాత్మక విజయం సాధించాయి.
ఈ నేపథ్యంలో స్థానిక, జాతీయ, అంతర్జాతీయ మీడియాతో అనేక మంది ప్రముఖులు చంద్రబాబును ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు సోదరుడి కుమారుడు, హీరో నారా రోహిత్ రాసిన ఒక లేఖ రాశాడు.
“పెదనాన్న… గత నాలుగున్నర దశాబ్దాలుగా మీరు రాజకీయాలలో ఉన్నారు. ఎన్నో ఒడిదుడుకులను చూశారు… తట్టుకున్నారు… ఆత్మవిశ్వాసంతో నిలబడ్డారు. కానీ గత ఐదేళ్ల కాలంలో ఎంతో వేదన అనుభవించారు. అయినప్పటికీ పార్టీని, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. మీకు కష్టం వచ్చినప్పుడు వాళ్లందరూ కుల, మత, ప్రాంతాలకు అతీతంగా మీ కోసం నిలబడ్డారు. అప్పుడు తెలిసింది… గత 40 ఏళ్ల మీ కష్టానికి మీరు పొందింది ప్రజల గుండెల్లో కదిలించలేని స్థానం అని.
చరిత్రలో ఎవరూ మళ్లీ తిరగరాద్దాం అని సాహసం చేయలేని విధంగా ఈ ఎన్నికల్లో విజయాన్ని అందుకున్నారు. ఈ విజయం ఎన్డీయే కూటమిది మాత్రమే కాదు… ఆంధ్రా ప్రజలది, తెలుగువారిది, మనందరిదీ.
నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మీకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరి తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు” అంటూ నారా రోహిత్ బావోద్వేగంగా రాసిన లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.