టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, టీడీపీ కీలక నేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. వైసీపీ నేతలు, పోలీసులు కలిపి ఎన్ని అడ్డంకులు సృష్టించినా సరే మొక్కవోని దీక్షతో పాదయాత్రను లోకేష్ కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా లోకేష్ పాదయాత్ర 50వ రోజుకు చేరుకుంది. పుట్టపర్తి నియోజకవర్గం ఒనుకువారిపల్లి విడిది కేంద్రం దగ్గర లోకేష్ పాదయాత్ర 50 రోజుల మైలురాయిని చేరుకుంది.
ఈ క్రమంలోనే లోకేష్ ను కలిసేందుకు వేలాదిమంది ప్రజలు హాజరయ్యారు. లోకేష్ అడుగులో అడుగు వేసేందుకు ఉత్సాహంగా స్వచ్ఛందంగా వారంతా తరలివచ్చారు. అంతేకాదు, లోకేష్ పాదయాత్ర వెంట కిలోమీటర్ల కొద్ది ఆ వేలాదిమంది జనం నడుస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. మరోవైపు, లోకేష్ పాదయాత్రకు మద్దతుగా సినీ హీరో, లోకేష్ సోదరుడు నారా రోహిత్ పుట్టపర్తి వచ్చారు. పుట్టపర్తిలోని విడిది కేంద్రం వద్ద లోకేష్ ను మర్యాదపూర్వకంగా కలిసిన నారా రోహిత్ ఆ తర్వాత లోకేష్ వెంట పాదయాత్రలో నడిచారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నారా రోహిత్…ఏపీ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా వెలువడిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీకి షాక్ తగిలిందని, ఆ పార్టీ ఇప్పుడు డిఫెన్స్ లో పడిందని రోహిత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక, జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ పునరాగమనంపై కూడా రోహిత్ షాకింగ్ కామెంట్స్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ రీఎంట్రీపై తనకు పెద్దగా సమాచారం లేదని, కానీ అవసరమైనప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పార్టీకి మద్దతుగా వస్తారని ఆశిస్తున్నట్లు రోహిత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
పుట్టపర్తిలో 50 వ రోజు యువగళం దృశ్యాలు..#LokeshinPuttaparthi#YuvaGalamPadayatra#YuvaGalam#LokeshPadayatra #NaraLokesh#NaraLokeshForPeople#YuvaGalamLokesh pic.twitter.com/yOOWHCsX3M
— Telugu Desam Party (@JaiTDP) March 25, 2023