టాలీవుడ్ హీరో నారా రోహిత్ ఎట్టకేలకు ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు కుమారుడైన నారా రోహిత్.. 2009లో బాణం మూవీతో ఇండస్ట్రీలోకి వచ్చాడు. ఆ తర్వాత అనేక చిత్రాల్లో నటించాడు. స్టార్ హీరోగా ఎదగలేకపోయినా.. టాలీవుడ్ లో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నాడు. కానీ ఇంత వరకు పెళ్లి మాత్రం చేసుకోలేదు.
అయితే నారా రోహిత్ పెళ్లి సెట్ అయినట్లు తాజాగా ఓ న్యూస్ తెరపైకి వచ్చింది. ఈ నెల 13వ తేదీన నారా రోహిత్ ఎంగేజ్మెంట్ వేడుక హైదరాబాద్ లో గ్రాండ్ గా జరగబోతోందట. ఈ వేడుకలో సీఎం చంద్రబాబు, బాలకృష్ణతో సహా కుటుంబ సభ్యులు సందడి చేయనున్నారని తెలుస్తోంది. త్వరలోనే వివాహ వేడుకను కూడా నిర్వహించనున్నారని సమాచారం.
ఇక నారా రోహిత్ పెళ్లాడబోయేది ఇండస్ట్రీకి చెందిన అమ్మాయినే అట. ఇటీవల ప్రతినిధి 2లో నారా రోహిత్ తో కలిసి నటించిన అమ్మాయే పెళ్లి కూతురని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారం ఎంత వరకు నిజమో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సిందే. కాగా, నారా రోహిత్ త్వరలోనే `సుందరకాండ` సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. లేటు వయసులో పెళ్లి చేసుకోవడం అనే కాన్సెప్ట్ తో ఈ మూవీ రాబోతుండటం విశేషం.