నారా లోకేష్ నాన్ స్టాప్ పర్యటనలు వైకాపాకు కలవరాన్ని కలిగిస్తున్నాయి. ప్రస్తుతతం కృష్ణా జిల్లాలోని కైకలూరు, పశ్చిమగోదావరి జిల్లాలోని తణుకు నియోజకవర్గాల్లో నారా లోకేష్ పర్యటిస్తున్నారు. మొన్న అనంతపురం జిల్లాలో పర్యటించి తీవ్రంగా నష్టపోయిన రైతులను వారి పంట పొలాలను పరిశీలించిన లోకేష్ రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని నిలదీశారు. ప్రజలతో మీడియాతో నారా లోకేష్ చాలా ఓపెన్ గా కలుపుగోలుగా ఉంటున్నారు.
ఈరోజు కృష్ణజిల్లా ముదినేపల్లి మండలం పెదపాలపర్రుకు వెళ్లిన లోకేష్‌కు టీడీపీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి లోకేష్ నివాళులు అర్పించారు. అనంతరం బోటు ద్వారా కృష్ణా నదిలో ప్రయాణించి పందిరిపల్లి గూడెం నుండి లంక గ్రామాల వరద బాధితులను పరామర్శించారు.
వడ్లకూటితిప్ప, పందిరిపల్లి గూడెం, గుమ్మాలపాడు, శృంగవరపాడు గ్రామాలలో రైతులు, వరద బాధిత ప్రజలను లోకేష్ పరామర్శించనున్నారు. స్వయంగా వారి కష్టాలు విని మీడియా ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారికి న్యాయం జరిగేందుకు కృషిచేస్తున్నారు. ఈరోజు కృష్ణా జిల్లాతో పాటు పశ్చిమగోదావరి జిల్లాలో నారా లోకేష్ పర్యటించారు.
ఇదిలా ఉంటే… వైకాపా లోకేష్ పై వేసిన పప్పు ముద్రను లోకేష్ ఎపుడో చెరిపేశారు. జగన్ కంటే స్పష్టంగా మాట్లాడుతున్నారు. జగన్ కంటే వేగంగా మాట్లాడుతున్నారు. జగన్ కంటే మంచి తెలుగు మాట్లాడుతున్నారు. జగన్ రెడ్డి కంటే ధైర్యంగా మీడియాను ఎదుర్కొంటున్నారు. మీడియాను రెట్టించి మరీ ప్రశ్నలు వేయమని అడుగుతున్నారు. లోకేష్ స్పీడు చూస్తుంటే వచ్చే ఎన్నికల్లోపు రాష్రంలో ప్రతి గ్రామంలో పర్యటించేలా కనిపిస్తున్నాడని అంటున్నారు. ఇది వైకాపా నేతలకు నిద్రపట్టకుండా చేస్తోంది.
గతంలో ఏ నేత నడుంలోతు బురద నీళ్లలో దిగిన విషయం ఎవరూ చూడలేదు. కానీ లోకేష్ నడుంలోతు నీటిలో దిగడం వైకాపా కేడర్ ను ఆశ్చర్యంలో ముంచెత్తింది. లోకేష్ తనలోని భయాలు అన్నింటినీ పటాపంచలు చేసేశారు. ఒక కొత్త మనిషిని తన కేడరుకు, జనానికి పరిచయం చేస్తున్నారు.