2020 లాక్ డౌన్ టైంలో వైద్యులకు కనీస వసతులు లేవు.
మాస్కులు గ్లౌజులు వంటివయినా సమకూర్చండి అని అడిగిన సుధాకర్ తెలుసు కదా.
మాస్కులు అడిగినంతనే జగన్ పరువు పోయినట్లు భావించి అతని మీద వ్యవస్థ మొత్తం కక్ష కట్టింది.
ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న జగన్ సర్కారు మీద ఈగ వాలనివ్వని పోలీసులు ఆయనను ఎంత అవమానించారో నడిరోడ్డు మీద ప్రపంచం చూసింది.
మాస్కులు అడిగిన పాపానికి అతని జీవితం పతనం అయ్యింది.
అతను మాట్లాడిన మాటల్లో తప్పే లేదు. కానీ నియంతలకు ప్రశ్నిస్తే నచ్చదు.
జగన్ పాలన బాగలేదు అని ఎవరూ అనకూడదు.
పాలన బాగాలేకున్నా శభాష్ అని పొగడాలి.
ఏపీలో ఇద్దరిని మాత్రమే పొగడాలి ఒకటి జగన్ ను, రెండు ఏసును.
అంతకుమించి ఎవరైనా మాట్లాడితే ఒక సుధాకర్, ఒక జేసీ, ఒక ధూళిపాళ, ఒక రఘురామరాజు
పోలీసు వ్యవస్థను ఎంత సమర్థంగా వాడుకోవచ్చో వైసీపీ సర్కారుకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు.
…
పాపం… సుధాకర్ జీవితం ముగిసిపోయింది.
సస్పెన్షన్, రోడ్డు మీద పడేసి టెర్రరెస్టును కొట్టినట్టు కొట్టడం
ఫోన్లు చేసి వేధించడం.
పిచ్చోడని ముద్ర వేయడం
ఇవన్నీ అతన్ని మానసికంగా కుంగదీశాయి.
పేరుమోసి మత్తు డాక్టర్ జీవితాన్ని తునాతునకలు చేసిన పాపం ప్రభుత్వ వ్యవస్థదే.
సీబీఐ దర్యాప్తులో నిజానిజాలు తేలకుండానే పరమపదించిన ఆయన కేసు ఎపుడు తేలుతుందో మరి.
తాజాగా నారా లోకేష్ ఆయన ఇంటికి వెళ్లారు.
ఇప్పటికైనా జగన్ ఈ కుటుంబానికి న్యాయం చేయాలి అని డిమాండ్ చేశారు.
జగన్ దేవుడు అని పొగిడించుకుంటాడు. మరి దేవుడికి ఉండే స్పందన ఏదీ?
ఇపుడు ఆదుకోండి ఆ కుటుంబాన్ని అని లోకేష్ డిమాండ్ చేశారు.
ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేసి
ఆ ఉద్యోగం ఆయన పిల్లల్లో ఎవరికో ఒకరికి ఇవ్వాలని డిమాండ్ చేశారు లోకేష్.
విశాఖలోని డాక్టర్ సుధాకర్ ఇంటికి చేరుకున్న నారా లోకేష్.
మాస్క్ అడిగారు అని దళిత మేధావిని వేధించి పిచ్చోడిని చేసి అనుకున్నది సాధించారు!! #DalitLivesMatter pic.twitter.com/bSU2C1iYVJ
— iTDP Official (@iTDP_Official) May 24, 2021
TDP General Secretary Sri @naralokesh meeting the family of Dr. Sudhakar to offer his condolences – LIVE from Visakhapatnam. #DalitLivesMatter
https://t.co/5Qi6ShzpOf— Telugu Desam Party (@JaiTDP) May 24, 2021