ఏలూరులో అంతుచిక్కని వ్యాధి కలకలంతో జనం విలవిల్లాడుతున్నారు. భయంతో వణుకుతున్నారు. మూర్ఛ లక్షణాలు, వాంతులతో రోగులు ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ప్రస్తుతానికి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 220 దాటేసింది. వైద్యాధికారుల స్పందన సాధారణంగా ఉంది.
ఏలూరులో వ్యాధి లక్షణాలపై వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది శాంపిల్స్ సేకరించారు. వాటి రిపోర్టుల కోసం స్థానికులు ఎదురుచూస్తున్నారు. ప్రజలు ఇంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటే ముఖ్యమంత్రి జగన్ సంఘటనా స్థలానికి కూడా రాలేదు. అదేమీ ప్రమాదకరమైన వాతావరణం కాదు. అయినా ఫోన్లోనే పరామర్శిస్తున్నారు. ఆరోగ్య శాఖ మంత్రి అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు.
తెలుగుదేశం నేత నారా లోకేష్ వెంటనే ఏలూరు ఆస్పత్రికి వెళ్లారు. రోగుల బంధువులతో మాట్లాడి వివరాలు తెలుసుకుంటున్నారు. ఆస్పత్రిపాలైన ప్రభుత్వ నిర్లక్ష్య బాధితులను పరామర్శించారు. సమస్యల్లో ఉన్న ప్రజల వద్దకు సీఎం రాకపోవడంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నట్టు స్పస్టంగా తెలుస్తోంది.