• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

జ‌గ‌న్‌కు చిప్ పోయింది.. నారా లోకేష్ హాట్ కామెంట్స్‌

admin by admin
February 20, 2024
in Andhra, Top Stories, Trending
0
nara lokesh
0
SHARES
61
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఏపీ సీఎం జ‌గ‌న్ కు చిప్ పోయింద‌ని.. నారా లోకేష్ హాట్ కామెంట్స్ చేశారు.
`మండుటెండలో కార్యకర్తలను సెల్ఫోన్ టార్చ్ ఆన్ చేయమంటూ చెప్పిన జగన్ కు చిప్ పోయింది.
జగన్ చెప్పిన మాటలతో కార్యకర్తలు ఒకరు మొహం ఒకరు చూసుకో వాల్సిన దుస్థితి ఏర్పడింది` అని నారా లోకేష్ విమర్శించారు.
విశాఖ నగర పరిధి ఉత్తర నియోజకవర్గంలో నిర్వహించిన శంఖారావం సదస్సులో ఆయన మాట్లాడుతూ… సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో లోకేష్ ధ్వజమెత్తారు.
ఉత్తరాంధ్ర ప్ర‌జ‌ల‌ జీవితాలతో జగన్ ఓ ఆట ఆడారని, రెండు నెలల్లో ప్రజలు జగన్ ను ఫుట్ బాల్ ఆడుకుంటారని లోకేష్ విమ‌ర్శించారు..“ పౌరుషాల గడ్డ, పోరాటాల పురిటిగడ్డ ఉత్తరాంధ్ర.
ఏపీకే కాకుండా దేశానికే సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖ“ అని లోకేష్ పేర్కొన్నారు.
చంద్రబాబు విశాఖను జాబ్ కేపిటల్ ఆఫ్ ఇండియాగా మారిస్తే… గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా జగన్ మార్చారన్న లోకేష్.. వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు గంజాయి మాఫియాను పెంచి పోషిస్తున్నారని ఆరోపించారు.

పేద‌వాడి చైత‌న్య ర‌థం!

అనంత‌పురం జిల్లా రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ నిర్వ‌హించిన సిద్ధం సభ వేదికగా సీఎం జ‌గ‌న్ చేసిన కామెంట్ల‌పైనా నారా లోకేష్ కౌంట‌ర్ ఇచ్చారు. టీడీపీ గుర్తు సైకిల్, జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసుపై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను లోకేష్ తిప్పి కొట్టారు.
`సైకిల్, గ్లాస్ విలువ పెత్తందారుకు అర్థంకాదు. సైకిల్ సామాన్యుడి చైతన్య రథం. గ్లాస్ లో సామాన్యుడు టీ తాగుతాడు. విషయాన్ని గుర్తించాలి. రైతు ఆత్మహత్యలకు ఫ్యాన్ ఉపయోగపడింది` అని విమర్శించారు.
ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ యువతను దగా చేసిన ఈ ప్రభుత్వానికి అదే యువత తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని లోకేష్ వెల్లడించారు. భవన నిర్మాణ కార్మికులను ఈ ప్రభుత్వం పట్టించుకోలేదని, వారి ఆత్మహత్యలకు ఫ్యాన్ ఉపయోగపడిందని విమర్శించారు.
ఐదేళ్ల పాలనలో 35 వేల మంది ఫ్యాన్ కు ఉరేసుకుని చనిపోయారని, అందుకే ఫ్యాన్ రెక్కలు విరిచి చెత్త బుట్టలో పడేయాలని లోకేష్ పిలుపునిచ్చారు.
నవరత్నాల పేరుతో నవ మోసాలు చేశారని, జలయజ్ఞం పేరు చెప్పి తట్ట మట్టి కూడా వేయలేదన్నారు. వందకు పైగా సంక్షేమ పథకాలను రద్దు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని ఆరోపించారు.
వైనాట్‌.. వైనాట్‌.. వైనాట్‌!
`వైనాట్ 175 అంటున్నారని, వైనాట్ విశాఖ స్టీల్ ప్లాంట్, వైనాట్ పోలవరం, వైనాట్ జాబ్ కేలండర్, గ్రూప్-1,2 పోస్టులు, వైనాట్ సంపూర్ణ మద్యపాన నిషేధం అని అంటున్నా. వీటిపై జగన్ సమాధానం చెప్పాలి` అని లోకేష్ డిమాండ్ చేశారు.
మా నమ్మకం నువ్వే జగన్ అంటున్నారని, కానీ సొంత తల్లి, చెల్లి కూడా నమ్మడం లేని వ్యక్తిని మనం ఎలా నమ్మాలి అని ప్రశ్నించారు. జగన్ రెడ్డి కటింగ్, ఫిట్టింగ్ మాస్టర్ అని, బల్లపైన బులుగు బటన్ నొక్కి అకౌంట్ లో పది వేసి, బల్ల కింద ఉన్న ఎర్ర బటన్ తో వంద లాగేస్తున్నారని లోకేష్ విమర్శించారు.

Previous Post

కేసీయార్ జోరు తగ్గిపోయిందా ?

Next Post

ఈఫిల్ ట‌వ‌ర్ మూసివేత‌.. వెనుదిరుగుతున్న ప‌ర్యాట‌క‌లు.. రీజ‌న్ ఇదే!

Related Posts

Movies

ఒక‌టి రెండుగా.. న‌టి పాయ‌ల్ రాజ్‌పుత్‌ కు అరుదైన వ్యాధి..!

May 19, 2025
Andhra

మోదీ దగ్గర లోకేశ్, జగన్ ల ఇమేజ్..ఇంత తేడానా?

May 18, 2025
Andhra

కేసుల దెబ్బకు ఫారెన్ వెళ్తున్న వైసీపీ నేత

May 18, 2025
Movies

వెంకీ – చెర్రీ ఓ మ‌ల్టీస్టార‌ర్‌.. ఇంత‌కీ డైరెక్ట‌ర్ ఎవ‌రు?

May 18, 2025
Andhra

అమెరికాకు కొడాలి నాని.. పెద్ద ప్లానే..!

May 18, 2025
Movies

ర‌ష్మికతో పెళ్లి.. ఓపెన్ అయిపోయిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌!

May 18, 2025
Load More
Next Post
Eiffel Tower, Paris, France

ఈఫిల్ ట‌వ‌ర్ మూసివేత‌.. వెనుదిరుగుతున్న ప‌ర్యాట‌క‌లు.. రీజ‌న్ ఇదే!

Latest News

  • ఒక‌టి రెండుగా.. న‌టి పాయ‌ల్ రాజ్‌పుత్‌ కు అరుదైన వ్యాధి..!
  • మోదీ దగ్గర లోకేశ్, జగన్ ల ఇమేజ్..ఇంత తేడానా?
  • కేసుల దెబ్బకు ఫారెన్ వెళ్తున్న వైసీపీ నేత
  • వెంకీ – చెర్రీ ఓ మ‌ల్టీస్టార‌ర్‌.. ఇంత‌కీ డైరెక్ట‌ర్ ఎవ‌రు?
  • అమెరికాకు కొడాలి నాని.. పెద్ద ప్లానే..!
  • ర‌ష్మికతో పెళ్లి.. ఓపెన్ అయిపోయిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌!
  • ప్రధాని మోదీతో లోకేష్ భేటీ – యువగళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ!
  • ఫ్రీ బస్ స్కీమ్ పై చంద్రబాబు బిగ్ అప్ ‘డేట్’!
  • ఫాల్కేపై సినిమా.. రాజమౌళి కి ఝలక్
  • భార‌తీయుల‌ దెబ్బ‌కు ట‌ర్కీ విల‌విల‌.. రూ. 770 కోట్లు న‌ష్టం..!
  • ఏపీ లిక్కర్ స్కాం..ఆ ఇద్దరి అరెస్టు
  • కాకాణి అరెస్ట్ కు కౌంట్ డౌన్ మొదలైంది..!
  • మ‌హానాడును మించి.. ఆ కార్య‌క్ర‌మం అదిరిపోవాలి: చంద్ర‌బాబు
  • అల్లు అర్జున్ తో ల‌వ్‌స్టోరీ.. నిహారిక పెద్ద ప్లానే వేసిందిగా..!
  • స‌మంత‌-రాజ్ రిలేష‌న్ క‌న్ఫార్మ్ చేసిన ప్ర‌ముఖ తెలుగు న‌టి..!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra