వెంకన్న సాక్షిగా నేను ప్రమాణం చేస్తా నాకు,నా కుటుంబసభ్యులకు వివేకా గారి హత్యతో సంబంధం లేదని.
14 న తిరుపతి వస్తున్న జగన్ రెడ్డి కి దమ్ము,దైర్యం ఉంటే వెంకన్న సాక్షిగా ఆయనకి,అయన కుటుంబసభ్యులకు వివేకా గారి హత్యతో సంబంధం లేదని ప్రమాణం చెయ్యాలి.తగ్గేదే లేదు ప్రమాణానికి నేను సిద్ధం జగన్ రెడ్డి సిద్దామా
రాష్ట్ర ప్రజలకు తెలియాలి హూ కిల్డ్ బాబాయ్?
మా తాత నందమూరి తారకరామారావు గారికి వెంకటగిరి రాజులంటే ఎంతో అభిమానం.
మా అమ్మకి వెంకటగిరి చీరలంటే ఎంతో ఇష్టం..
మా నాన్న నారా చంద్రబాబునాయుడి గారికి వెంకటగిరి అంటే ప్రత్యేకమైన ప్రేమ..
మీకు మూడు కోతుల నీతి తెలుసు కదా.చెడు వినకు,చెడు చూడకు,చెడు మాట్లాడకు.
ఇప్పుడు జగన్ రెడ్డి 28 కోతుల కధ చెబుతా.జగన్ రెడ్డి పార్లమెంట్ కి 28 కోతులు పంపాడు.22 కోతులు లోక్ సభ లో,6 కోతులు రాజ్యసభలో ఉన్నాయి.ఈ కోతులు రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడవు,వినవు,పోరాడవు.
ఒక ఎంపీ బాబాయ్ గుండెలపై గొడ్డలి దింపాడు.
మరొక ఎంపీ అరటితోటలకు అగ్గిపెడతాడు.
ఇంకొక ఎంపీ అత్యాచారాలకు పాల్పడతాడు
పార్టీ అధ్యక్షుడు జగన్‌రెడ్డి ఏ1 అయితే ఏ2 మరొక ఎంపీ ఏ4 మరొక ఎంపీ, ఏ7 ఇంకొక ఎంపీ …
రాష్ట్ర సమస్యల పై పోరాడుతుంది ఒక్క టిడిపి ఎంపీలు మాత్రమే.ప్రత్యేకహోదా,విశాఖ ఉక్కు,విశాఖ రైల్వే జోన్ పై సింహాల్లా పోరాడుతుంది ఒక్క టిడిపి ఎంపీలు మాత్రమే.
28 కోతులకు తోడుగా ఇంకో కోతిని పంపుదామా?లేక సింహంలా పోరాడే పనబాక లక్ష్మి గారిని పార్లమెంట్ కి పంపుదామా?
సుదీర్ఘ అనుభవం ఉండి,మహిళలు ఎదుర్కునే సమస్యలు బాగా తెలిసిన మన ఇంటి లక్ష్మి గారిని గెలిపించండి.
ఏ రాష్ట్రానికైనా ముఖ్యమంత్రి ఉంటారు.మంత్రివర్గం ఉంటుంది.పంచాయతీ రాజ్,ఐటీ,ఇలా శాఖలు ఉంటాయి.
కానీ జగన్ రెడ్డి పాలనలో శాఖలు ఏంటో తెలుసా?
హవాలా శాఖా మంత్రి
బూతులశాఖా మంత్రి
బెంజ్ కారు శాఖా మంత్రి
నోటిపారుదల శాఖా మంత్రి
జగన్ రెడ్డి ది జేసిబి ప్రభుత్వం.జే అంటే జగన్ సర్వీస్ ట్యాక్స్.దేశమంతా జిఎస్టి మన రాష్ట్రంలో మాత్రం జగన్ సర్వీస్ ట్యాక్స్.సి అంటే కటింగ్,బి అంటే బాదుడే బాదుడు…
ముందు జగన్ సర్వీస్ ట్యాక్స్ గురించి చెబుతా.
ఇసుక బంగారం అయ్యింది.వైకాపా ఇసుకాసురులు పందికొక్కుల్లా తింటున్నారు.టిడిపి హయాంలో ట్రాక్టర్ ఇసుక రూ.1500,జగన్ రెడ్డి హయాంలో ట్రాక్టర్ ఇసుక రూ.5000
సిమెంట్ ధర కూడా పెంచేసాడు టిడిపి హయాంలో బస్తా సిమెంట్ రూ.250,జగన్ రెడ్డి దండుపాళ్యం గ్యాంగ్ సిమెంట్ ధర రూ.370కి పెంచింది.
మద్యపాన నిషేధం అని మహిళల్ని మోసం చేసాడు.నకిలీ మద్యం అమ్ముతున్నాడు.కేంద్రం మెడలు వంచి హోదా తెస్తా అంటే నిజం అనుకున్నాం తెచ్చాడు స్పెషల్ స్టేటస్ చీప్ లిక్కర్ బాటిల్,బూమ్ బూమ్,గోల్డ్ మెడల్ తెచ్చి అన్ని సాధించాం అంటున్నాడు.
ఇక కటింగ్ గురించి చెబుతా.అన్నా క్యాంటిన్ ఎత్తేసాడు,సంక్రాంతి,క్రిస్మస్,రంజాన్ కానుకలు రద్దు చేసాడు.పెళ్లి కానుక ఎత్తేసారు.
రైతులకు భరోసా అంటూ దగా చేసాడు.12,500 అని 7,500 మాత్రమే ఇస్తున్నాడు.ఏడాదికి 5 వేలు కోత,ఐదేళ్లలో 25 వేలు కోత.
విత్తనాలు దొరకవు,ఎరువుల ధరలు పెరిగిపోయాయి.పండించిన పంటకు గిట్టుబాటు ధర రాదు.
ముస్లిం సోదరులను దగా చేసాడు జగన్ రెడ్డి.రంజాన్ తోఫా,ఇమామ్, మౌజామ్లకు ఇచ్చే గౌరవ వేతనం,పెళ్లికానుక,విదేశీ విద్య తొలగించారు.
ఇక బాదుడు రెడ్డి గురించి చెబుతా.
నిత్యావసర సరుకులు,రేషన్ సరుకులు,ఇసుక,సిమెంట్,విద్యుత్,పెట్రోల్,డీజిల్,గ్యాస్,ఆర్టీసీ ఛార్జీలు,ఇంటి పన్ను…ఆఖరికి చెత్త,జగన్ బ్రాండ్ లిక్కర్ ధరలు కూడా పెంచేసాడు
1)బాబు గారి హయాంలో సన్ ఫ్లవర్ లీటర్ నూనె రూ. 86 బాదుడు రెడ్డి హయాంలో సన్ ఫ్లవర్ నూనె రూ.200.
2)బాబు గారి హయాంలో కిలో కందిపప్పు రూ. 74 బాదుడు రెడ్డి హయాంలో కిలో కందిపప్పు రూ.140.
3)బాబు గారి హయాంలో రేషన్ షాపులో కిలో కందిపప్పు రూ. 40 బాదుడు రెడ్డి హయాంలో రేషన్ షాపులో కిలో కందిపప్పు రూ.67.
4)బాబు గారి హయాంలో రేషన్ షాపులో కిలో పంచధార రూ. 20 బాదుడు రెడ్డి హయాంలో రేషన్ షాపులో కిలో కందిపప్పు రూ.34.
5)బాబు గారి హయాంలో కిలో చింతపండు రూ. 114 బాదుడు రెడ్డి హయాంలో కిలో చింతపండు రూ.251.
6)బాబు గారి హయాంలో పెట్రోల్ ధర రూ. 76 బాదుడు రెడ్డి హయాంలో పెట్రోల్ ధర రూ.97 త్వరలో సెంచరీ కొడతాడు. 7)బాబు గారి హయాంలో డీజిల్ ధర రూ. 68 బాదుడు రెడ్డి హయాంలో డీజిల్ ధర రూ.93
8)బాబు గారి హయాంలో గ్యాస్ ధర రూ. 754 బాదుడు రెడ్డి హయాంలో గ్యాస్ ధర రూ.900 త్వరలో వెయ్యి కొడతాడు.
కుడి చేత్తో 10 రూపాయిలు ఇచ్చి ఎడమ చేత్తో 100 రూపాయిలు కొట్టేస్తున్నాడు.
యువకులకు ఉద్యోగాలు వచ్చాయా?ఉద్యోగాల క్యాలెండర్ అన్నారు.క్యాలెండర్ లో సంవత్సరాలు మారుతున్నాయి కానీ ఉద్యోగాల క్యాలెండర్ మాత్రం రావడం లేదు.పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తేసాడు.
టిడిపి హయాంలో 5 లక్షల 16 వేల ఉద్యోగాలు,ఐటీ శాఖ ద్వారా 35 వేలు ఉద్యోగాలు వచ్చాయి అని వైకాపా ప్రభుత్వమే ప్రకటించింది
యువకులకు ఒక్క ఉద్యోగం రాలేదు వైకాపా కార్యకర్తలకు మాత్రం వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చాడు
ఆఖరికి నిరుద్యోగ భృతి కూడా తీసేసారు
కేంద్రం మెడలు వంచి హోదా సాధిస్తా!కంపెనీలు తెస్తా యువతకు ఉద్యోగాలు కల్పిస్తా అన్నాడు.జగన్ రెడ్డి మొహం చూసి ఒక్క కంపెనీ వచ్చిందా?ఒక్క ఉద్యోగం ఇచ్చాడా.
టిడిపి హయాంలో రాయలసీమ ని ఎలెక్ట్రానిక్స్ మరియు ఆటోమొబైల్ హబ్ గా మార్చాము.ఫ్యాక్స్ కాన్ ,సెల్ కాన్,డిక్షన్,రిలయన్స్ జియో ,టిసిఎల్,అపోలో టైర్స్,హీరో మోటార్స్ ఇలా చెప్పుకుంటూ పోతే ఒక రోజు సరిపోదు.
మహిళల్ని అర్ధ ఒడి తో మోసం చేసాడు.ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరికి అమ్మ ఒడి అన్నారు.ఇప్పుడు ఒక్క బిడ్డకే అంటున్నారు.అది కూడా కోతలు
45 ఏళ్లకే మహిళలకు పెన్షన్ అన్నారు.దాని ఊసే లేదు.
అవ్వా,తాతలకు 3 వేల పెన్షన్ అన్నాడు.250 పెంచి…ఏడాదికి 9 వేలు,ఐదు ఏళ్లలో 45 వేలు అవ్వా,తాతలకు చెందాల్సిన దొబ్బుతున్నాడు
జగన్ రెడ్డి వల్ల సొంత చెల్లెళ్ళకే న్యాయం జరగలేదు. ఒక చెల్లెమ్మ ఢిల్లీ లో న్యాయం కోసం పోరాడుతుంది.ఇంకో చెల్లెమ్మను తెలంగాణకు తరిమేశారు.వాళ్ళని చూస్తుంటే బాధేస్తుంది.
జగన్ సొంత నియోజకవర్గంలో దళిత మహిళ నాగమ్మ ను దారుణంగా చంపేస్తే ఈరోజు వరకూ ఆ కుటుంబానికి న్యాయం జరగలేదు.ఇక రాష్ట్రంలో ఉన్న మిగిలిన మహిళలకు జగన్ న్యాయం ఎలా చేస్తాడు.
జగన్ రెడ్డి పేరు మార్చా ఆయన పేరు సైకో రెడ్డి.ఎందుకో తెలుసా ఆయనకు దళితులు అంటే కోపం.
తిరుపతి ఎంపీగా ఉన్నప్పుడు బల్లి దుర్గాప్రసాద్ గారికి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా వేధించారు.దళితుడనే కనీస గౌరవం ఇవ్వడం లేదంటూ ఆయన మీడియా ద్వారా బాధని వ్యక్తం చేసారు.
దళిత నేత చనిపోతే కనీసం నివాళులు అర్పించడానికి వెళ్లని సైకో రెడ్డి ఆయన సామజిక వర్గం ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణా రెడ్డి చనిపోతే స్పెషల్ ఫ్లైట్ లో క్షణాల్లో వాలిపోయాడు.
బద్వేల్ ఎమ్మెల్యే వెంకట సుబయ్య దళిత నేత చనిపోతే అక్కడికి వెళ్లి శవం పక్కన నిలబడి నవ్వుతున్నాడు.
ముఖ్యమంత్రి పక్కన దళిత ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి గారు నిలబడాలి,మంత్రి పెద్ది రెడ్డి దర్జాగా కూర్చుంటాడు.
అక్రమ మద్యం మాఫియా ని ప్రశ్నించాడు అని దళిత యువకుడు ఓం ప్రతాప్ ని చంపేశారు.
మాస్క్ పెట్టుకోలేదు అంటూ చీరాల లో దళిత యువకుడు కిరణ్ ని పోలీస్ స్టేషన్ లో కొట్టి చంపేశారు.
తూర్పుగోదావరి జిల్లాలో అక్రమ ఇసుక మైనింగ్ ని ప్రశ్నించాడు అని దళిత యువకుడు వర ప్రసాద్ కి పోలీస్ స్టేషన్ లో గుండు కొట్టించారు.
విశాఖ లో మాస్క్ అడిగారని డాక్టర్ సుధాకర్ గారిపై పిచ్చివాడనే ముద్ర వేసారు.
చిత్తూరు జిల్లా లో డాక్టర్ అనితా రాణి గారు వైకాపా నాయకుల అవినీతి కి సహకరించలేదు అని బట్టలు మార్చుకుంటుంటే వీడియోలు తీసి వేధించారు.
ఐదేళ్ల టిడిపి పాలనలో వెంకటగిరి అభివృద్ధికి వేలకోట్ల నిధులు మంజూరు చేశారు.
రోడ్లు,పేదలకు టిడ్కో ఇళ్ళు,గ్రామాల్లో సిసి రోడ్లు,180 కోట్లతో రైతు రధాలు,ఎస్సి,ఎస్టీ,బిసిలకు
404 కోట్లతో తాగునీటి సదుపాయం కల్పించాం.
మరి ఇప్పుడేమయ్యింది 2 ఏళ్లలో వెంకటగిరి అభివృద్ధి చెందిందా?
జగన్ పాలన ఎంత అరాచకంగా వుందో వైసీపీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి గారి మాటలే నిదర్శనం
మాఫియా అడ్డాగా నెల్లూరు మారిపోయింది
ల్యాండ్, శాండ్…వైన్, మైన్ మాఫియాలు రెచ్చిపోతున్నాయి.
బెట్టింగ్ బంగార్రాజులు చెలరేగిపోతున్నారు..
ఎమ్మెల్యేలు, మంత్రుల అక్రమాలకు అడ్డుపడిన ముగ్గురు ఎస్పీలను బదిలీ చేయించారు
తేనె కావాలంటే వెంకటగిరి అడవిలో దొరుకుతుంది…మాఫియా ముఠాలని కలవాలంటే నెల్లూరు వస్తే చాలంటూ పెద్దాయన ఆనం ఆందోళన వ్యక్తం చేశారు.
వైసీపీ ఏడాది పాలనపై సంబరాలు చేసుకుంటుంటే…కడుపుమండిన ఆనం రాంనారాయణరెడ్డి గారు 2020 జూన్ లో జగన్ సర్కారు వైఫల్యాలను కడిగి పారేశారు..
అభివృద్ధి పనులు చేపట్టాలని సీఎం ఆదేశించినా దిక్కులేదని, ఏడాది పాలనపై కేకులు కోయడం సిగ్గుచేటన్నారు..
వెంకటగిరికి వంద పడకల ఆస్పత్రి, డయాలసిస్ సెంటర్, ట్రామా కేర్ ఆస్పత్రి, గురుకుల పాఠశాల కావాలని అడిగితే పట్టించుకునే వారే లేరన్నారు.
ఆర్థికశాఖా మంత్రిగా వేలకోట్లు నిధులు కేటాయించిన ఆనం.. తన నియోజకవర్గంలో ఒక రోడ్డుకి నిధులు తెచ్చుకోలేకపోవడంపై తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేశారు.
వెంకటగిరి మున్సిపాలిటీకి ఒక కాలువ వేయలేకపోయాను..కొత్తగా ఒక రోడ్డు తేలేకపోయాను…మంచినీటి సమస్య పరిష్కరించలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో 174 నియోజకవర్గాలే వున్నాయా? నా నియోజకవర్గం వెంకటగిరిని రద్దు చేశారా? ఎందుకింత వివక్ష అని ప్రశ్నించారు.
ఈ విమర్శలు నేను చేసినవి కాదు వైకాపా ఎమ్మెల్యే చేసిన ఆరోపణలు
మీ పార్టీ ఎమ్మెల్యే అడుగుతున్నారు జగన్ రెడ్డి ఎం సమాధానం చెబుతాడు.
పోలీసుల్ని వాడుకుని తెలుగుదేశం కార్యకర్తలు, నేతల్ని ఇబ్బంది పెడుతున్నారు..
అన్నీ రాసుకుంటున్నాం.. అందరినీ గుర్తు పెట్టుకున్నాం..
ఇప్పుడు మీరు కొడుతున్నారు..మేము పడతన్నాం
అధికారంలోకొచ్చిన వెంటనే ఎవరికివ్వాల్సినవి వారికిచ్చేస్తాం..లేకపోతే లావైపోతాం..
స్టాన్‌ఫోర్డ్‌లో చదివొచ్చాడు…సాఫ్ట్‌గా ఉన్నాడనుకుంటున్నారు..
నాపై కేసులు పెట్టు..నన్ను ఇబ్బంది పెట్టు..భరిస్తాను
మా కార్యకర్తల జోలికొస్తే మాత్రం ఊరుకోను.
పసుపు జెండా చూస్తే జగన్ కి ప్యాంట్ తడిచిపోతుంది
టిడిపి 10 రోజుల ప్రచారానికే జగన్ తిరుపతి పరిగెత్తుకొని వస్తున్నాడు
ఇక ఉపఎన్నికల్లో టిడిపి కి ఓటు వేస్తే జగన్ భూమ్మీదకి వచ్చి జనాల కష్టాలు వింటాడు.
టిడిపి గెలిస్తే పెట్రోల్ ధరలు ఎలా తగ్గుతాయని దోంగ పత్రిక ఎద్దేవా చేస్తుంది.
టిడిపి గెలిస్తే జగన్ అహంకారం తగ్గుతుంది.పెట్రోల్ పై ఆయన విధిస్తున్న 28 రూపాయిల పన్నుని సగానికి తగ్గిస్తాడు.పక్క రాష్ట్రాల పెట్రోల్ బంకుల్లో ఎపి కంటే రూ.3,రూ.5 తక్కువ అని బోర్డులు పెట్టి మరీ జగన్ బాదుడు గురించి చెబుతున్నారు.
టిడిపి గెలిస్తే ప్రజల పై జగన్ మోపిన పన్నుల భారం తగ్గుతుంది.
తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి పనబాక లక్ష్మి గారిని
గెలిపించండి మీ సమస్యల పై పార్లమెంట్ లో పోరాడే శక్తి ఆమెకు ఇవ్వండి.