దేవాలయాలపై వరుస దాడుల నేపథ్యంలో ప్రభుత్వం పరువు గంగలో కలిసింది. ఇంటా బయటా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఒకటి రెండు కాదు… ఇలా వరుసగా 130 సంఘటనలు జరిగేటపటికి ఈ ఘటనలకు కారణం ఏంటో జనాలు ఒక అంచనాకు వచ్చేశారు. దీంతో దీన్నుంచి బయటపడటం ప్రభుత్వానికి అసాధ్యమైపోయింది.
మరోవైపు ప్రభుత్వం గవర్నమెంటు డబ్బును చర్చిల నిర్మాణానికి ఇవ్వడంతో జనం అనుమానాలు మరింత బలపడ్డాయి. హిందువులను టార్గెట్ చేశారని జనానికి ఒక ఆలోచన మొదలైంది.
ఇంతలో పోలీసులు స్వయంగా వెల్లడించిన వేర్వేరు కారణాలు జనంలో వారి పరపతిని తగ్గించాయి. సీతమ్మ విగ్రహాన్ని ఎలుకలు పాడు చేశాయని, కర్నూలులో పిచ్చోళ్లు కూల్చారని… అంతర్వేది రథం తేనె కోసం తగలబెట్టారని… ఇలా పోలీసులు చెప్పిన కారణాలు హిందువుల మనసును తీవ్రంగా గాయపరిచాయి.
ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా జనంలో టాక్ తెలుసుకున్న జగన్… దీని బారిన తప్పించుకోవడానికి వేసిన పన్నాగమే ఈ దాడులకు కారణంగా టీడీపీ నేతలను అరెస్టు చేయడం అని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. తాజాగా టీడీపీ నేతల పేర్లను తెరపైకి తెచ్చి అరెస్టు చేయడమే దీనికి ఉదాహరణ అని చెబుతోంది. తాజా అరెస్టులపై లోకేష్ నారా డీజీపీకి వేసిన వరుస ప్రశ్నలకు ఏపీ పోలీసుల వద్ద సమాధానం ఉందో లేదో తెలియడం లేదు.
ఇంతకీ లోకేష్ ఏమన్నారంటే…
విగ్రహాలు ధ్వంసం చేసింది దొంగలు, పిచ్చోళ్లని నిన్న చెప్పిన డిజిపి దొరా, నేడు రాజకీయ కుట్ర కోణంవైపు మీ మాటెందుకు తిరిగింది! రాత్రికి తాడేపల్లి కొంపలో @ysjagan మార్క్ భోగి పళ్లేమైనా మీకు పోశారా?(1/4)
మీరు విడుదల చేసిన జాబితాలో కర్నూలు జిల్లా గూడూరు మండలం పొన్నకల్లులో ఆంజనేయస్వామి దేవాలయాన్ని కూల్చేసిన వైసీపీ నేత దామోదర్ రెడ్డి పేరు లేదేం?(2/4)
ఓంకార క్షేత్రంలో అర్చకులను చితక్కొట్టిన వైసీపీ నేత ప్రతాపరెడ్డి పేరు ప్రస్తావించలేదెందుకు? ఆంజనేయుడు చేయి విరిగితే రక్తమొస్తుందా? రాముడి తల తెగితే విగ్రహం ప్రాణం పోతుందా? అని హిందుత్వంపైనే దాడికి దిగిన బూతుల మంత్రి నానిపై కేసు ఎందుకు పెట్టలేదు?(3/4)
హిందుత్వం మనుగడనే ప్రశ్నించేలా దాడులు జరుగుతుంటే నిందితులను పట్టుకోవడం చేతకాక చేవచచ్చిన మీపై ముందు కేసుపెట్టాలి. తప్పుడు సమాచారంతో రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నందుకు కోర్టులు మీపై సుమోటోగా కేసు నమోదు చేయాలి.(4/4)