గుంటూరు జిల్లా పొన్నూరు కాంపౌండ్ వాల్ వీడియో తీసిన వ్యక్తిని అరెస్టు చేయలేదు అంటూ గుంటూరు పోలీసులు ప్రకటించారు. అంతేకాదు, నారా లోకేష్ ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారు. అది చట్టపరంగా తప్పు, పోలీసులు ఎస్సీ కమ్యూనిటీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టు ప్రచారం చేయడం మంచిది కాదని, అలా చేయొద్దు అని చెప్పడంతో పాటు అలా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని నారా లోకేష్ ను ఎస్పీ హెచ్చరించారు.
ఉదయం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలుగుదేశం యువ నాయకుడు నారా లోకేష్… కాంపౌండ్ వాల్ వీడియో తీసినందుకు అక్రమంగా మణి అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు అంటూ ట్వీట్ చేశారు. దీనిపై పై విధంగా స్పందించిన ఎస్పీ లోకేష్ చెప్పింది అబద్ధం అని కొట్టి పారేశారు.
దీనిపై నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. డియర్ ఎస్పీ సార్… మీకు దమ్ముంటే పెదకాకాని పోలీస్ స్టేషన్ సీసీ ఫుటేజ్ విడుదలం చేయండి. స్టేషన్ నుంచి విడుదల అయినప్పుడు మణి ఫొటో ఇక్కడ పెడుతున్నాను. లేకపోతే మీరు మీ రాజకీయ ఉన్నతాధికారుల కోసం వంగిపోవడాన్ని ఆపాలి! అంటూ గట్టిగా రిప్లై ఇచ్చారు.
లోకేష్ సవాల్ టీడీపీ కేడర్ ను ఆకట్టుకుంది. లోకేష్ లో ఈ ఫైర్ ఉంటే జగన్ ను రాజకీయంగా పడేయటం పెద్ద పనే కాదు అని పార్టీ కేడర్లో జోష్ కనిపిస్తోంది.