https://www.youtube.com/watch?v=x1650JXE74w&t=1s
గౌతమ్ రెడ్డి హఠాన్మరణం అందరినీ కలచివేసిన విషయం తెలిసిందే. ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తంచేశారు.
రాజకీయంగా కీలక కుటుంబం అయిన మేకపాటి కుటుంబం మర్యాదకరమైన రాజకీయాలు చేస్తుంది. అందుకే వైసీపీ నేత కుటుంబం అయినా చంద్రబాబు వేగంగా స్పందించారు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని గౌతమ్ రెడ్డి నివాసానికి చేరుకున్న చంద్రబాబు…. గౌతమ్ రెడ్డి భౌతికకాయానికి నివాళులు అర్పించారు.
భార్య శ్రీ కీర్తిని, కుటుంబ సభ్యులను చంద్రబాబు పరామర్శించారు. ఇప్పటికే విజయమ్మ కుటుంబం, కేవీపీ కుటుంబం, ఇంకా పలువురు ప్రముఖులు గౌతమ్ రెడ్డి కి వెళ్లారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, వైసీపీ నేత మేకపాటి గౌతమ్ రెడ్డి గారి హఠాన్మరణ వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ… వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను pic.twitter.com/zyZZuVBgLe
— N Chandrababu Naidu (@ncbn) February 21, 2022
ఐదుపదుల వయస్సులోనే హుందా గల రాజకీయవేత్తగా పేరుగాంచిన మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మనకి దూరం కావడం తీరని విషాదం. మేకపాటి గౌతమ్‌రెడ్డి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను.(2/2)
— Lokesh Nara (@naralokesh) February 21, 2022