ఎన్నికల ప్రచారం అనగానే.. నాయకులు సామాన్యుల మనసు ఆకట్టుకునేందుకు చేయని ప్రయత్నం అంటూ ఉండదు. సామాన్యుల్లో సామాన్యులైపోతారు.. కూలీల్లో కూలీలుగా కూడా మారిపోతారు. వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు కోడలు, యువ నాయ కుడు.. నారా లోకేష్ సతీమణి.. నారా బ్రాహ్మణి.. కూలీ అవతారమెత్తారు. ఆదవారం ఉదయం మంగళగిరిలో పర్యటించిన ఆమె వస్తూ వస్తూనే దుగ్గిరాల సమీపంలోని పూల తోటల్లోకి పరుగులు పెట్టారు.
అక్కడ ఉదయాన్నే పూలు కోసే పనిలో ఉన్న కూలీలతో కలిసిపోయారు. తాను కూడా ఓ కూలీగా మారిపో యి.. గంపెడు పూలు కోశారు. ఈ సమయంలో మహిళా కూలీలతో ముచ్చట్లు పంచుకున్నారు. వారి సమ స్యలు తెలుసుకున్నారు. పింఛన్లు వస్తున్నాయా? అని అడిగి తెలుసుకున్నారు. ఇళ్లు, ఇతర సదుపాయా లను కూడా అడిగి తెలుసుకున్నారు. అనంతరం.. ఇదేనియోజకవర్గంలోని చేనేతల ఇళ్లను సందర్శిం చారు. వారి పనితీరును పరిశీలించారు. మగ్గం దారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం.. నారా బ్రాహ్మణి మాట్లాడుతూ.. మంగళగిరిని మోడల్ నియోజవర్గంగా మార్చేందుకు తన భర్త నారా లోకేష్ ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఇక్కడి సమస్యలు తెలుసుకున్నానని.. వాటిని పరిష్క రించేందుకు తన వంతు ప్రయత్నంకూడా చేస్తానని చెప్పారు. రాష్ట్రంలో గత ఐదేళ్ల నుంచి ఎలాంటి పరిపాలన ఉందో అందరూ చూస్తున్నారని తెలిపారు. మంగళగిరిలో నారా లోకేష్‌ను గెలిపించాలని ఆమె ఓటర్లకు పిలుపునిచ్చారు.
ఎన్నికలు జరిగే వరకు.. తన ప్రచారం కొనసాగుతుందన్న నారా బ్రాహ్మణి.. తెలిపారు. ఇంటింటికీ తిరిగి.. మహిళలను ఓట్లు అభ్యర్థించనున్నట్టు చెప్పారు. అన్ని వర్గాల వారికీ న్యాయం చేసేలా.. చంద్రబాబు సూపర్ సిక్స్ ను తీసుకువచ్చారన్న ఆమె.. దీనిపైనా ప్రచారం చేస్తామని.. మంగళగిరిలో సామాన్యుల సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తామని అన్నారు.
పెన్షన్లు తీసేసారు, కోటా బియ్యం ఇవ్వటం లేదు, ధరలు పెరిగిపోయాయి, ఉద్యోగాలు లేవు, జే-బ్రాండ్స్ తో నాశనం అవుతున్నారు.. బేతపూడిలో నారా బ్రాహ్మణి గారి దగ్గర తమ సమస్యలు చెప్పుకున్న మహిళా కూలీలు..#NaraLokeshForMangalagiri#AndhraPradesh pic.twitter.com/DYBE5XT3vg
— Telugu Desam Party (@JaiTDP) April 21, 2024