టీడీపీ నాయకుడు, ఎమ్మెల్యే నందమూరి బాలయ్య కుమార్తె, టీడీపీ అధినేత చంద్రబాబు కోడలు.. బ్రాహ్మణి సంబరాల్లో ముని గిపోయారు. “మావారు గెలుస్తున్నారోచ్“ అంటూ.. ఆమె హర్షం వ్యక్తం చేశారు. తాజాగా మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించిన ఆమె.. రోడ్ల వెంట తిరుగుతూ.. ఇంటింటికీ వెళ్లారు. ప్రతి మహిళను పలకరించారు. ఈ సందర్భంగా ఆమెకు ప్రజల నుంచి అనూహ్యమైన ఆదరణ లభించింది. నిజానికి గత వారం నుంచి మంగళగిరిలోనే ఉంటున్నా.. ఆమె ఇంటింటి ప్రచారం చేయలేదు. ఇప్పటి వరకు తోటలు, పేటల్లో మాత్రమే పర్యటించి.. ప్రచారం చేశారు.
కానీ, మంగళవారం మాత్రం మంగళగిరిలోని ప్రధాన రహదారుల వెంట తిరిగి.. సమీప ఇళ్లకు వెళ్లారు. మహిళలను పలకరిం చారు. నియోజకవర్గం సమస్యలు తెలుసుకున్నారు. ముఖ్యంగా మంగళగిరిలో అభివృద్ధి చేయాలని అంశాలను ప్రస్తావించారు. వారి నుంచి సమాచారం సేకరించారు. అంతేకాదు.. మహిళలకు అండగా ఉంటామని.. హామీ ఇచ్చారు. వృత్తులను ప్రోత్సహిస్తా మని చెప్పారు. మహిళా సాధికారతకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. మంగళగిరిలో ఎవరు గెలుస్తున్నారని ఆమె ప్రతి ఒక్కరినీ ఆరా తీశారు. అంతేకాదు.. గత ఎన్నికల్లో ఓడిపోయినా.. తన భర్త నారాలోకేష్.. మంగళగిరిలోనే ఉండి ప్రజలకు సేవ చేశారని చెప్పుకొచ్చారు. ఆయనను గెలిపించాలని ఆమె కోరారు.
అయితే.. ఆమె చెప్పకుండానే.. పలువురు మహిళలు ఈ సారి నారా లోకేష్ గెలుస్తున్నారని చెప్పడంతో బ్రాహ్మణి ఆనందానికి లోనయ్యారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. నారా లోకేష్ పేరు చెప్పకుండా.. “ఈసారి మా వారు గెలుస్తున్నా రు. ఇక్కడే ఉంటాం. ఇక్కడే ఇల్లు కట్టుకుంటాం. ఇక్కడి ప్రజలకు అందుబాటులో ఉంటాం. ఇక్కడి సమస్యలను పరిష్కరించే బాధ్యతను నేను తీసుకుంటాను. ఇక్కడి పిల్లలను చదివిస్తాను“ అని అనర్గళంగా చెప్పుకొచ్చారు. బ్రాహ్మణిని పలువరు టీడీపీ నాయకులు కలిసి.. సత్కరించే ప్రయత్నం చేయగా ఆమె సున్నితంగా తిరస్కరించారు.