ఏపీలో నామినేటెడ్ పోస్టులు ఎవరెవరికి దక్కబోతున్నాయన్న చర్చ కొద్ది రోజులుగా జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ మొత్తం పోస్టుల్లో ముఖ్యంగా టీటీడీ ఛైర్మన్ పోస్టు జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డికే దక్కనుందా లేదా అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది. ఈ క్రమంలోనే ఆ సస్పెన్స్ కు తెరదించుతూ తాజాగా ఏపీలో నామినేటెడ్ పోస్టు జాబితాను అధికారికంగా విడుదల చేశారు. అంతా ఊహించినట్టుగానే TTD ఛైర్మన్ గా మళ్ళీ YV సుబ్బారెడ్డిని నియమిస్తూ జగన్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, ఎమ్మెల్యేలకు మాత్రం జగన్ నామినేటెడ్ పోస్టుల్లో చాన్స్ ఇవ్వలేదు.
రాష్ట్రంలోని మొత్తం 135 కార్పొరేషన్ చైర్మన్ ల పేర్లను హోం మంత్రి మేకతోటి సుచరిత ప్రకటించారు. వీటిలో దాదాపు 76 పదవులను SC,ST,BC మైనారిటీలకు కేటాయించారు. 59 మంది OC వర్గానికి చెందిన వారికి కార్పొరేషన్ చైర్మన్ పదవులు దక్కాయి. మొత్తం 135 పోస్టుల్లో మహిళలకు 68, పురుషులకు 67 కేటాయించారు. 56 శాతం వెనుకబడిన వర్గాలకు, 50.3 శాతం మహిళకు కేటాయించారు.
ఏపీలో నామినేెటెడ్ పోస్టుల జాబితా ఇదే
NEDCAP ఛైర్మన్ గా కె.కె రాజు
స్మార్ట్ సిటి కార్పొరేషన్ ఛైర్మన్ గా ప్రముఖ ఆడిటర్ జి.వి
ఏపీ కమ్మ కార్పొరేషన్ చైర్మన్ గా పెనమలూరు నియోజకవర్గం నుండి తుమ్మల చంద్రశేఖర్ (బుడ్డి)
ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా బొప్పన భవకుమార్…..
ఏపీఐఐసీ చైర్మన్గా మెట్టు గోవర్ధన్ రెడ్డి
కాపు కార్పొరేషన్ చైర్మన్గా అడపా శేషు
రాష్ట్ర విద్యావిభాగం చైర్మన్గా మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్
ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా సుధాకర్ సతీమణి
రాష్ట్ర మైనార్టీ విభాగం చైర్మన్గా జాన్ వెస్లీ
రాష్ట్ర గ్రంథాలయ కార్పొరేషన్ చైర్మన్గా దాడి రత్నాకర్
ఏపీ ఎండీసీ చైర్మన్గా అస్లాం (మదనపల్లి)