టాలీవుడ్ సెలబ్రటీ కపుల్స్ లో ఒకరైన సమంత రూత్ ప్రభు–నాగచైతన్యల విడాకుల విషయంపై కొద్ది నెలల క్రితం తీవ్ర చర్చ జరిగిన సంగతి తెలిసిందే. వారిద్దరూ అధికారికంగా విడాకుల గురించి ప్రకటించకముందే రకరకాల పుకార్లు సోషల్ మీడియాలో షికార్లు చేశాయి. ఇక, వారిద్దరూ విడిపోయిన తర్వాత కూడా ఫలానా కారణంతోనే విడిపోయారంటూ సోషల్ మీడియాలో, కొన్ని యూట్యూబ్ ఛానెళ్లలో రకరకాల కథనాలు వచ్చాయి. అయితే, సమంత-నాగ చైతన్యల విడాకులపై చాలాకాలం సైలెంట్ గా ఉన్న నాగార్జున…ఇటీవల ఓపెన్ అయిన సంగతి తెలిసిందే. కొందరు ఇలాంటి చెత్త ప్రచారాలు చేస్తున్నారని, వారి విడాకులపై లేనిపోని పుకార్లు పుట్టిస్తున్నారని నాగ్ అసహనం వ్యక్తం చేశారు.
ఇక, తాజాగా మరోసారి నాగచైతన్య–సమంత విడాకులపై నాగార్జున స్పందించారు. ఈ క్రమంలోనే సమంతపై నాగ్ షాకింగ్ కామెంట్లు చేశారు. చైతూ నుంచి సమంతే మొదట విడాకులు కోరిందని నాగార్జున సంచలన విషయాన్ని వెల్లడించారు. అంతేకాదు, విడాకుల ప్రయత్నాలనూ మొదలుపెట్టింది కూడా సమంతేనంటూ నాగ్ బాంబు పేల్చారు. చైతూ కేవలం సమంత నిర్ణయాన్ని గౌరవించి విడాకులకు ఓకే చెప్పాడని నాగార్జున చెప్పుకొచ్చారు.సామ్–చైతూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారని, వారి నాలుగేళ్ల వివాహబంధంలో విడిపోయేంతటి పెద్ద సమస్యేంటో తనకూ ఇప్పటికీ తెలియదని నాగ్ అన్నారు.
వారిద్దరూ గత ఏడాది నూతన సంవత్సర వేడుకలనూ కలిసే జరుపుకొన్నారన్నారని గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాతే వారి మధ్య సమస్యలు వచ్చాయని, అవేంటో తనకు ఇంకా తెలియదని చెప్పారు నాగ్. కానీ, విడాకుల విషయం తనతో చెప్పడానికి చైతూ ఎంతో ఆవేదన చెందాడని, తన గురించే, తమ కుటుంబ పరువు గురించి ఎక్కువ బాధపడ్డాడని చెప్పారు. ఆ విషయాన్ని తానెలా తీసుకుంటానోనని కలత చెందాడని నాగార్జున చెప్పారు. సమంతే మొదట విడాకులు అడిగిందంటూ నాగ్ చేసిన వ్యాఖ్యలపై సమంత రియాక్షన్ ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.