టాలీవుడ్ లోని స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతోన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్…వెండితెరపై హీరోగానే కాకుండా బుల్లితెరపై మంచి హోస్ట్ గా కూడా ప్రూవ్ చేసుకున్నాడు. తాజాగా తారక్ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న “ఎవరు మీలో కోటీశ్వరులు” షోకు బుల్లితెర తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ గేమ్ షోకు వస్తున్న టీఆర్పీలు వారం వారం పెరిగిపోతుండడమే ఇందుకు నిదర్శనం. ఈ ప్రోగ్రాం కర్టన్ రైజర్ షోకు 11.4 టీఆర్పీ రావడం విశేషం.
తారక్ హోస్ట్ గా వ్యవహరించిన లాంచ్ ఎపిసోడ్ లో గెస్ట్ కంటెస్టెంట్ గా చరణ్ రావడంతో బుల్లితెర ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోయారు.
షో ప్రారంభమై మూడు వారాలు అవుతుండగా..వారం వారం టిఆర్పీ పుంజుకుంటోంది. మొదటి వారానికి 5.62 టిఆర్పీ రాగా…రెండో వారం 6.48 టీఆర్పీ వచ్చింది. మూడో వారం షోకు 7.30 టిఆర్పి రేటింగ్ రావడంతో షో నిర్వాహకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అయితే, దాదాపుగా ఈ షోకు పోటీగా ప్రసారమవుతున్న “బిగ్ బాస్ తెలుగు సీజన్ 5” టీఆర్పీలో దూసుకెళ్తోంది. కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో కర్టెన్ రైజర్ కు 15.7 రేటింగ్ వచ్చింది. సీజన్ 4 లాంచింగ్ ఎపిసోడ్ కు 18.5 టీఆర్పీ రాగా, సీజన్ 3కు ఆ టీఆర్పీ 17.9గా ఉంది. గతంతో పోలిస్తే తక్కువ రేటింగ్ ఉన్నా…‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో హోస్ట్ తారక్ తో పోటీలో నాగ్ ముందున్నాడు.
ఈ క్రమంలోనే నాగ్ ట్విట్టర్ ద్వారా ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియచేశారు. ‘థ్యాంక్యూ ఆల్ ఫర్ 5 మచ్ లవ్’. మీరు బిగ్ బాస్ 5 లాంచ్ ని నెంబర్ వన్ చేసి స్టార్ మాని ఓడించలేనిదిగా చేశారు. బిగ్గెస్ట్ వావ్’ అంటూ ట్వీట్ చేశాడు నాగ్. వచ్చే ఆదివారం నుంచి ఐపిఎల్ ఆరంభం కానుంది. ఆ పోటీని తట్టుకొని ఈ రెండు తెలుగు రియాలిటీ షోలు ఎలా నిలబడతాయో వేచి చూడాలి. క్రమక్రమంగా “ఎవరు మీలో కోటీశ్వరులు” షో “బిగ్ బాస్”ను బీట్ చేస్తుందని తారక్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇక తమన్నా చేస్తున్న “మాస్టర్ చెఫ్ ఇండియా” తెలుగు వంటల ప్రోగ్రాంకు ఈ రేసులో చాలా వెనుకబడి ఉంది.