యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య మళ్లీ పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. గత రెండేళ్ల నుంచి ప్రముఖ హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో సీక్రెట్ లవ్ లో ఉన్న నాగచైతన్య.. ఇప్పుడు ఆమెతో ఏడడుగులు వేసేందుకు సిద్ధం అయ్యాడు. ఆగస్టు 8న నాగార్జున నివాసంలో వీరి నిశ్చితార్థం వేడుక నిరాడంబరంగా జరిగింది. కుటుంబ సభ్యుల సమక్షంలో నాగచైతన్య, శోభిత ఉంగరాలు మార్చుకుని హాఫ్ కపుల్ గా ప్రమోట్ అయ్యారు.
ఇందుకు సంబంధించిన ఫోటోలను మొట్టమొదట నాగార్జున సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. నూతన జంటకు బెస్ట్ విషెస్ తెలిపారు. అయితే పెళ్లెప్పుడు అన్నది మాత్రం వెల్లడించారు. తాజాగా ఈ విషయంపై నాగార్జున క్లారిటీ ఇచ్చారు. ఓ ఆంగ్ల ఛానల్‌తో మాట్లాడుతూ.. `మంచి రోజు అని సడెన్‌గా నిశ్చితార్థ కార్యక్రమం పెట్టుకున్నాం. శోభిత పేరెంట్స్ తో పాటు చైతు మదర్ కూడా ఎంగేజ్మెంట్ లో పాల్గొన్నారు. పెళ్లి విషయంలో తొందరేమి లేదు` అని నాగార్జున చెప్పుకొచ్చారు.
అలాగే నాగచైతన్యపై ఈ సందర్భంగా నాగార్జున కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. `విడాకుల తర్వాత చైతన్య డిప్రెషన్లోకి వెళ్లాడు. కానీ తన పెయిన్ ను ఎవరితోనూ పంచుకోలేదు. చైను చూస్తూ నేను చాలా బాధ పడ్డాను. ఇప్పుడు మళ్లీ తన ముఖంలో నవ్వు చూస్తున్నాను. నాగచైతన్య, శోభిత వండర్ ఫుల్ కపుల్` అంటూ నాగార్జున పేర్కొన్నారు. అంతేకాదు శోభిత ఎంతో తెలివైన అమ్మాయని.. తను చైతు లైఫ్‌లోకి రావడం సంతోషంగా ఉందని నాగ్ తెలిపారు. మొత్తానికి నాగ చైతన్య-శోభిత పెళ్లి వేడుక వచ్చే ఏడాది ఉంటుందని నాగార్జున వ్యాఖ్యలతో స్పష్టం అయింది.