టాలీవుడ్ మాజీ కపుల్ నాగ చైతన్య, సమంతలు విడాకుల తర్వాత కెరీర్ పరంగా చాలా బిజీ అయిపోయారు. సమంత వరుస సినిమాలతో పాన్ ఇండియా రేంజ్ లో చెలరేగిపోతుంటే, చైతూ కూడా లాల్ సింగ్ చద్దా వంటి బిగ్ ప్రాజెక్ట్ తో బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు. ఇక, తెలుగులోనూ థ్యాంక్యూ సినిమాతో చైతూ మరోసారి ఫ్యామిలీ అడియన్స్ ను అలరించబోతున్నాడు. ఇక, చైతూ తర్వాతి సినిమాకు సంబంధించిన తాజా అప్టేడ్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఎందుకంటే, చైతూ తన తర్వాతి ప్రాజెక్ట్ ను సమంత బెస్ట్ ఫ్రెండ్ అయిన దర్శకురాలు నందిని రెడ్డితో చేయబోతున్నాడట. టాలీవుడ్ లేడీ డైరెక్టర్ నందిని రెడ్డితో ఓ సినిమాకు చైతూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది.వైజయంతీ మూవీస్ పతాకంపై స్వప్నా దత్ నిర్మించబోతున్న ఈ సినిమా పట్టాలెక్కేందుకు రెడీగా ఉందట. వాస్తవానికి సమంత, నాగ చైతన్యలతో ఈ సినిమా తెరకెక్కించాలని నందిని రెడ్డి ప్లాన్ చేసిందట.
అయితే, అనుకోకుండా సమంత, నాగచైతన్యల విడాకుల వ్యవహారంతో నందిని రెడ్డి ప్రాజెక్టుకు బ్రేకులు పడ్డాయి. అయితే, తాజాగా ఈ ప్రాజెక్టుకు నాగచైతన్య గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వేరే హీరోయిన్ తో ఈ సినిమా చేసేందుకు నందిని రెడ్డి రెడీ అవుతోందట. వెంకట్ ప్రభు తో చైతూ సినిమా పూర్తయిన తర్వాత ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుందట. అయితే, ఈ సినిమాలో హీరోయిన్ గా సమంతను తీసుకుంటారా అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. కానీ, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అది సాధ్యం కాదని మరికొందరు నెటిజన్లు అంటున్నారు.