• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

చైతూ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్

admin by admin
November 23, 2024
in Uncategorized
0
0
SHARES
45
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

శనివారం అక్కినేని నాగచైతన్య పుట్టిన రోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అతడి నెక్స్ట్ రిలీజ్ ‘తండేల్’ నుంచి ఒక మాస్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర బృందం. దీంతో పాటు చైతూ తర్వాత నటించబోయే సినిమా నుంచి ప్రి లుక్ పోస్టర్ వదిలారు. ‘విరూపాక్ష’తో బ్లాక్ బస్టర్ కొట్టిన కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించబోతున్న సినిమా ఇది. ‘విరూపాక్ష’ తరహాలోనే ఇది కూడా మిస్టిక్ థ్రిల్లర్ అనే విషయం పోస్టర్ చూస్తేనే అర్థమవుతోంది. ‘విరూపాక్ష’కు స్క్రీన్ ప్లే అందించడంతో పాటు నిర్మాణంలోనూ భాగస్వామి అయిన కార్తీక్ గురువు సుకుమార్.. ఈ సినిమాతోనూ అసోసియేట్ అయ్యారు. ‘విరూపాక్ష’ ప్రొడ్యూసర్ బీవీఎస్‌ఎన్ ప్రసాదే ఈ మూవీని కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు. హీరో మారాడు తప్ప.. మిగతా టీం అంతా కొనసాగుతున్నట్లే కనిపిస్తోంది. జానర్ కూడా అదే.

నిజానికి ‘విరూపాక్ష’ తర్వాత దాని సీక్వెల్ తీయాలని అనుకున్నాడు కార్తీక్. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. ఐతే తర్వాత ‘విరూపాక్ష’ తరహాలోనే, అంతకంటే పెద్ద కాన్వాస్‌లో మిస్టిక్ థ్రిల్లర్ కథను తీర్చిదిద్దుకున్నాడు కార్తీక్. ఈసారి సుకుమార్ ‘పుష్ప-2’లో బిజీగా ఉండి, తీరిక లేకపోవడం వల్ల ఈ సినిమాకు స్క్రీన్ ప్లే బాధ్యతలేమీ తీసుకోలేదు. జస్ట్ కథ విని ఓకే చేశారు. చిన్న కరెక్షన్లు మాత్రమే చెప్పారు. ఈ కథ నాగచైతన్యకు బాగుంటుందని సూచించి.. తనతో మాట్లాడి ప్రాజెక్టు సెట్ చేసింది సుకుమారే.

‘పుష్ప-2’ పని పూర్తయ్యాక ఈ ప్రాజెక్టును సుకుమార్ పర్యవేక్షిస్తారు. ‘విరూపాక్ష’ ఏకంగా వంద కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేయడం, చైతూ తర్వాతి చిత్రం ‘తండేల్’ ప్రామిసింగ్‌గా కనిపిస్తుండడంతో నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ పెద్ద సాహసమే చేయబోతున్నారు. ఈ సినిమా మీద వంద కోట్ల బడ్జెట్ పెడుతున్నారట. చైతూ కెరీర్లో ఇది హైయెస్ట్ బడ్జెట్ మూవీ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హీరో ఒక విచిత్ర ప్రపంచంలోకి వెళ్లి రహస్యాన్ని ఛేదించే నేపథ్యంలో ఈ సినిమా కథ నడుస్తుంది. వచ్చే ఏడాది రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టనున్నారు.

Tags: Director Karthik DanduHBD Naga ChaitanyaLatest newsmovie budgetNaga ChaitanyaNC24New FilmTelugu NewsTollywood
Previous Post

చైతూ, శోభిత ల ప్రేమకు మధ్యవర్తి ఎవరో తెలిస్తే షాక్ !

Next Post

మహారాష్ట్ర సీఎం ‘పీఠం’ ముడి విప్పేదెవరు?

Related Posts

Uncategorized

ప‌వ‌న్ హైంద‌వ డ్రామా… లోకేష్ నాట‌కం: బీసీవై రామ‌చంద్ర యాద‌వ్ ఆగ్ర‌హం

March 12, 2025
Crime In India
Uncategorized

కేంద్ర మంత్రి కూతురికి పోకిరీ ల వేధింపులు.. !!

March 2, 2025
Uncategorized

పీక్స్ కు ట్రంప్ బ్యాచ్.. 250 డాలర్ల నోట్లకు ఆయన బొమ్మేనట

February 26, 2025
Uncategorized

వైసీపీ కి రాజీనామా.. క్లారిటీ ఇచ్చేసిన ఎంపీ అయోధ్య రామిరెడ్డి!

January 28, 2025
priyanka gandhi vadra
Uncategorized

ప్రియాంక పై పోటీ చేసే బీజేపీ అభ్యర్థిపై ఎవరో తెలుసా?

October 20, 2024
Trending

`మంచి దొంగ‌`.. సినిమా కాదు.. చ‌దివితే తెలుస్తుంది!

July 17, 2024
Load More
Next Post

మహారాష్ట్ర సీఎం ‘పీఠం’ ముడి విప్పేదెవరు?

Latest News

  • మ్యాడ్ బాయ్స్ ముందు తేలిపోయిన `రాబిన్ హుడ్‌`..!
  • అర్థ‌మైందా రాజా.. వైసీపీ నేత‌ల‌పై లోకేష్ సెటైర్లు..!
  • `మ్యాడ్ స్క్వేర్` మాస్ జాత‌ర‌.. ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ ఎంతంటే?
  • 43 వసంతాల తెలుగుదేశం.. తెలుగుజాతికి న‌వోద‌యం!
  • టీవీ 9 తో ప్ర‌ధాన‌మంత్రి.. పేద‌రికంపై గ‌ళమెత్తిన మోదీ..!
  • `రాబిన్ హుడ్‌`.. ఆడియన్స్ కు అదిదా సర్‌ప్రైజు లేదుగా!
  • మ‌ళ్లీ నిరాశే.. వ‌ల్ల‌భ‌నేని వంశీ ని వీడని క‌ష్టాలు!
  • జ‌గ‌న్‌కు బిగ్ షాక్‌.. జ‌న‌సేన‌లోకి వైసీపీ కీల‌క నేత‌!?
  • ప్ర‌భాస్ పెళ్లి సెట్‌..!?
  • P4 చంద్రబాబు లక్ష్యం పెద్దది – కానీ అర్థమయ్యేది ఎంత మందికి?
  • ప‌వ‌న్‌ ఉస్తాద్ మీద మ‌ళ్లీ ఆశ‌లు
  • `రాబిన్ హుడ్‌` వ‌ర్సెస్ `మ్యాడ్‌2`.. ఎవ‌రి టార్గెట్ ఎంత‌?
  • పాస్టర్ ప్రవీణ్ పగడాలది హ‌త్యే.. ష‌ర్మిల సంచ‌ల‌న ట్వీట్‌!
  • పాస్టర్ ప్రవీణ్ మృతిపై బాబు, లోకేశ్ రియాక్షన్
  • తండేల్ టికెట్ రేట్ల పెంపు…ఇండస్ట్రీ ఏం నేర్చుకోలేదా?
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra