యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య 2017 లో ప్రముఖ హీరోయిన్ సమంతను పెళ్లాడిన సంగతి తెలిసిందే. గోవాలో రెండు సాంప్రదాయాలు ప్రకారం ఈ జంట డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. కానీ వీరి బంధం నాలుగేళ్లకే విడాకులతో ముగిసింది. అయితే ఇప్పుడు నాగచైతన్య రెండో పెళ్లికి సిద్ధం అయ్యాడు. తెలుగు అమ్మాయి శోభిత ధూళిపాళ్లతో చైతు ఏడడుగులు వేయబోతున్నాడు.
ఆగస్టు 8న వారి నిశ్చితార్థ వేడుక జరిగింది. అయితే పెళ్లి తంతును మాత్రం హడావుడి పడకుండా జరిపించాలని ఇరు కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. 2025 ఫిబ్రవరి లేదా మార్చిలో నాగచైతన్య-శోభిత వివాహానికి ముహూర్తం ఫిక్స్ చేయనున్నారట. ఇకపోతే నాగచైతన్య మరోమారు డెస్టినేషన్ వెడ్డింగ్ వైపు మొగ్గు చూపుతున్నాడు.
అయితే ఈసారి రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో తన వెడ్డింగ్ కు సరిపోయే మంచి లొకేషన్స్ పరిశీలిస్తున్నాడట. ఒకవేళ ఆయా రాష్ట్రాల్లో కుదరకపోతే విదేశాల్లో పెళ్లి చేసుకోవాలని నాగచైతన్య-శోభిత భావిస్తున్నారని ఇన్సైడ్ జోరుగా ప్రచారం జరుగుతుంది. కాగా, సినిమాల విషయానికి వస్తే.. చైతు ఇప్పుడు తండేల్ మూవీతో బిజీగా ఉన్నాడు. చందూ మొండేటి డైరెక్ట్ చేస్తున్న తండేల్ లో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ఆల్మోస్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.