వైసీపీ నాయకుడు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి రాష్ట్ర విభజనపై తాజా చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే.
ఆయన చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడుతున్నాయి. జనసేన కూడా సజ్జల వ్యాఖ్యలపై గయ్యిమని లేస్తోంది. విశాఖపట్నంలో పర్యటిస్తున్న జనసేన ఛైర్పర్సన్ నాదేండ్ల మనోహర్ సజ్జల క్షమాపణలు చెప్పాలని డిమాండు చేశారు.
ప్రజల మధ్య విభజన చిచ్చు పెట్టి రాజకీయ లబ్ది పొందాలనుకుంటున్న వైసీపీ నేతలకు మాట్లాడే అర్హత లేదన్నారు. ముందుగా సజ్జలరామకృష్ణారెడ్డి ఆయన చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పి తరువాత మాట్లాడాలన్నారు.
పనిలోపనిగా పవన్ కల్యాణ్ యాత్ర చేపట్టబోయే వారాహీ వాహనంపైన వైసీపీ నేతలు చేస్తున్న కామెంట్లను ఆయన తిప్పికొట్టారు.
ప్రభుత్వ కార్యాలయాలకు రంగులేసినవాళ్లు, హైకోర్టుచేత చీవాట్లు తిన్న వారా జనసేన వారాహి వాహనం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.
నిబందనలకు అనుగుణంగ3ఆనే వాహనం సిద్ధమైందన్నారు. ఏ రంగు వేశారో చూడకుండా, నిబంధనలను పరిశీలించకుండానే రవాణశాఖాధికారులు ఎలా అనుమతిస్తారని ఆయన ప్రశ్నించారు.
జనసేనాని పవన్ కల్యాణ్ చేపట్టే ప్రతి పని కూడా చట్టానికి లోబడే ఉంటుందని స్పష్టం చేశారు. పనవ్పై వ్యక్తిగత విమర్శలు చేయడం వైసీపీ నాయకులకు అలవాటుగా మారిందన్నారు.
జనసేపైన ప్రజలకు నమ్మకముందన్నారు. పవన్ కల్యాణ్ అన్నమయ్య బాధితులను పరామర్శిస్తే ఆ తరువాత ప్రభుత్వం వారి ఖాతాల్లో నగదు వేసిందని, మరోమారు పవన్ అక్కడ పర్యటిస్తే ప్రభుత్వం దిగొచ్చి ఇళ్లు కట్టిస్తుందనే నమ్మకంతో అక్కడి ప్రజలున్నారన్నారు.
జనసేనపై జనానికి ఉన్న నమ్మకానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని నాదేండ్ల ప్రశ్నించారు.