గత ప్రభుత్వ హయాం నాటికే పూర్తి అయిన ఇళ్లను, నిర్మాణంలో చివరి దశలో ఉన్న ఇళ్లను ఇప్పటివరకు ప్రజలకు అప్పగించకపోవడంపై ఏపీలో కొత్త ఉద్యమం మొదలైంది. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉద్యమానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది
అప్పట్లోనే ప్రజలకు కేటాయించిన ఈ ఇళ్లు ఇప్పటికీ వారికి ఇవ్వడంలో జగన్ సర్కారు విఫలం కావడంతో ఉద్యమం చేసి మన ఇల్లు మనం సాధించుకుందాం అని తెలుగుదేేశం పార్టీ ఇచ్చిన పిలుపునకు భారీ స్పందన వస్తోంది.
ఆ స్పందనకు మచ్చుతునక ఈ ఫొటోలు. ఇవి సత్తెనపల్లిలో సగంలోనే ఆగిపోయిన టిడ్కో ఇళ్ళ ఎదుట బాధితుల ధర్నాలతో వారితో తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు.