కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అన్న కోమటిరెడ్డి కాంగ్రెస్ లోనే ఉన్నారు. దీంతో ఈ కుటుంబంపై ఇరుపార్టీల్లోను నమ్మకం కుదరడం లేదు. దీంతో ఇపుడు జరుగుతున్న ఉప ఎన్నికలో ప్రజలు ఏం చేస్తారా అన్న ఆసక్తి పెరుగుతోంది.
రాజగోపాల్ రెడ్డి తన అర్థబలంతో టిఆర్ఎస్ మరియు కాంగ్రెస్ నుండి నాయకులు బిజెపిలో చేరేలా చూసుకుంటున్నారు. కానీ కొంతవరకే ఆయన ప్రయత్నాలు ఫలిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఆగస్ట్‌లో జరిగిన సర్వేలు ఫలితాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. మొత్తం ఐదు సర్వేలు
మునుగోడు రిజల్ట్‌ను అంచనా వేసాయి. కానీ ఏ ఒక్క సర్వేలోను కాషాయ పార్టీ ముందంజలో లేదు. ఇక్కడ అధికార టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో ఉందని మూడు సర్వేలు చెబుతుండగా, మిగిలిన రెండు కాంగ్రెస్ సీనియర్ నేతను కోల్పోయినప్పటికీ సీటును నిలబెట్టుకోగలదని చెబుతున్నాయి.
2018 ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి ఇక్కడ నుంచి 49 శాతం మెజార్టీతో గెలుపొందారు. ఇక్కడ నుంచి టీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ గెలిస్తే రాజగోపాల్‌రెడ్డి రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడిపోవడంతో పాటు బీజేపీకి కూడా ఇబ్బంది తప్పదు. అయితే బీజేపీని అంత తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదు. నేరుగా అమిత్ షాయే రంగంలో దిగారు.
ఇక్కడ బిజెపి గెలిస్తే, అది తిరుగులేని శక్తిని పొందుతుంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో చాలా బలమైన శక్తి అవుతుంది. అంతేకాదు ఆ ఊపులో 30 సీట్లు కొట్టేసి ప్రభుత్వంలో భాగం కావాలని ప్రయత్నాలు చేస్తోంది. మరి ఓటర్లు ఏం చేస్తారో చూడాలి.