విషయం ఏదైనా కానీ కాస్తంత ప్రజాదరణ ఉన్న అంశాల్లో.. అంచనాలు మాత్రమే తప్పించి ఫలితం తెలీని విషయాల మీద బెట్టింగ్ జరగటం సర్వసాధరణంగా మారింది.
ఇందుకు మునుగోడు ఉప పోరు కూడా మినహాయింపు కాదు.
మునుగోడు ఉప ఎన్నిక లో కీలకమైన పోలింగ్ ఘట్టం ముగిసిన తర్వాత నుంచి గెలుపు మీద బెట్టింగుల జోరు తగ్గినట్లుగా చెబుతున్నారు.
దీనికి కారణం.. ఫలితం దాదాపుగా కన్ఫర్మ్ అయినట్లేనని.. అనూహ్య పరిస్థితుల్లో తప్పించి గెలుపు గులాబీ వాకిట్లోనే ఉందని.. అధికారంగా ప్రకటించటమే ఆలస్యమన్న మాట వినిపిస్తోంది.
ఇలాంటి వేళ.. టీఆర్ఎస్ గెలుపు మీద బెట్టింగ్ పెట్టటానికి బోలెడంత మంది ఆసక్తి చూపుతున్నా.. ఆ బెట్టింగ్ ను తీసుకునే పరిస్థితుల్లో బెట్టింగ్ నిర్వాహకులు లేరు.
దీంతో.. బెట్టింగ్ తీరు మారింది. మునుగోడు ఉప ఎన్నిక కోసం మంత్రులు మొదలు కొని ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలను ఆయా గ్రామాల ఇన్ ఛార్జులకు నియమించటం తెలిసిందే.
దీంతో.. బెట్టింగ్ తీరు మారింది. మునుగోడు ఉప ఎన్నిక కోసం మంత్రులు మొదలు కొని ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలను ఆయా గ్రామాల ఇన్ ఛార్జులకు నియమించటం తెలిసిందే.
చివరకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో అత్యంత కీలకంగా వ్యవహరించే మంత్రి కేటీఆర్.. హరీశ్ రావులు సైతం మునుగోడు ఉప ఎన్నికల్లో గ్రామాలకు ఇన్ ఛార్జులుగా వ్యవహరించాల్సి వచ్చింది.
దీంతో.. కేటీఆర్ ఇన్ ఛార్జిగా వ్యవహరించిన గ్రామంలో ఎక్కువ లీడ్ వచ్చిందా? హరీశ్ రావు ఇంఛార్జిగా ఉన్న గ్రామంలో లీడ్ అధికంగా వస్తుందా? ఈటెల రాజేందర్ అత్తగారి ఊళ్లో ఏ పార్టీకి అత్యధిక ఓట్లు వస్తాయి? ఇలాంటి అంశాల మీద బెట్టింగ్ జోరు సాగినట్లు చెబుతున్నారు.
ఇదంతా వింటే.. ఈ బెట్టింగులకు మూలమైన మునుగోడు ఉపపోరు ఫలితం మీద కంటే కూడా.. కొసరు అంశాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం.. ఇప్పుడు బెట్టింగులు మొత్తం ఇలాంటి విషయాల చుట్టూనే సాగుతుండటం గమనార్హం.
మరి.. మునుగోడు ఎవరి వరంగా మారుతుందన్నది ఈ రోజు అధికారికంగా తేలిపోనుంది.