కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం.. వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధమని ప్రకటిం చారు. అయితే.. ఇక్కడ ఆయన ఒక ట్రిక్ ప్లే చేశారు. తనంతట తానుగా పోటీకి దిగడం లేదనే కలరింగ్ ఇచ్చారు. పవన్ తనకు సవాల్ విసిరితే… తాను అప్పుడు బరిలోకి దిగుతానన్నది ఆయన చెప్పిన మాటే. “మీరు పిఠాపురం నుంచి పోటీ చేసేందుకు సిద్ధం అయి.. నాకు సవాల్ విసరండి.. అప్పుడు నేను మీపై పోటీ చేస్తాను“ అని లేఖలో స్పష్టం చేశారు.
అంటే.. ముద్రగడ తొలి ఎత్తు.. తనంతట తానుగా కాదు…పవన్ సవాల్ విసిరితే(అడిగి మరీ సవాల్ విసిరిం చుకోవడం)నే తాను పోటీకి దిగాననే సెంటిమెంటును ప్లే చేయాలనేది స్పష్టంగా కనిపిస్తోంది. సరే.. ఇది జరిగేదో.. కాదో.. పక్కన పెడితే.. ఒకవేళ ఎవరూ ఎలాంటి సవాళ్లు విసరకపోయినా.. మొత్తానికి ఆయనలో చేవ ఉందనే విషయాన్ని మాత్రం ఆయనే చెప్పారు. నేను పోటీకి సిద్ధమని ప్రకటించిన ఆయన… ఒకవేళ పవన్ సవాల్ విసరకపోయినా. పోటీ చేయొచ్చు.
ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. ముద్రగడకు ఉన్న ప్లస్‌లు ఎన్ని..? మైనస్‌లు ఎన్ని? అనేది ఆసక్తి కర చర్చగా మారింది. నిజానికి ముద్రగడ సొంత నియోజకవర్గం జగ్గంపేట. కానీ.. ఇక్కడ ఆయన పోటీ చేసేందుకు అవకాశం లేదు. దీంతో వ్యూహాత్మకంగా పిఠాపురం నియోజకవర్గం ఎంచుకున్నా రు. ఈ నియోజకవర్గంలోనూ 40 శాతం కాపు ఓటు బ్యాంకు ఉంది. దీనిని గుర్తించే ఆయన ఇక్కడ ఎంచుకుని ఉంటారనేది ఒక చర్చ.
అయితే.. ముద్రగడ అనుకుంటున్నట్టు కాపులంతా.. ఆయన పక్షాన లేరనేది తాజాగా.. వినిపిస్తున్న టాక్. కాపు ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు.. తర్వాత.. కూడా.. ముద్రగడకు అనుకూలంగా అనేక గళాలు వినిపించాయి. అయితే.. ఆయన వైసీపీ సర్కారు రాగానే.. ఉద్యమాన్ని వదిలేయడం మైనస్ అయింది. దీంతో కాపులు ఆయనను విశ్వసించే ప్రయత్నం చేయడం లేదు. మరోవైపు.. తోట త్రిమూర్తులు(ప్రస్తుత ఎమ్మెల్సీ) వంటి నాయకులు ముద్రగడను తీవ్రంగా వ్యతిరేకించే వర్గంలో ఉన్నారు.
వీరు ముద్రగడకు ఎప్పుడూ వ్యతిరేకంగానే ఉన్నారు. సో.. ముద్రగడ కనుక గెలిస్తే.. జిల్లాలో తమ ఆధిపత్యం తగ్గుతుందని అనుకునేవారిలో అమ్మాజీ వంటివారు కూడా ఉన్నారు. దీనిని పరిగణనలోకి తీసుకుంటే.. ముద్రగడకు.. సొంత సామాజిక వర్గంలోనే వ్యతిరేక వర్గం స్పష్టంగా కనిపిస్తోంది. దీనిని అధిగమించే ప్రయత్నం ఆయన చేయలేరు. పైగా.. ముద్రగడను ఔట్ డేటెడ్ నాయకుడిగా.. కొందరు ఇప్పటికే ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో ముద్రగడకు ప్లస్లకన్నా.. మైనస్‌లే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు.