బిర్యానీ ప్రియులు మంత్ర ముగ్ధులయ్యేలా, వారు కోరుకునే విభిన్న రుచుల్లో వేడి వేడి పసందైన, నోరూరించే అద్భుతమైన బిర్యానీలను రుచిగా, శుచిగా అందించేందుకు రెడీ అయిపోయింది “మిస్టర్ బిర్యానీ“!
నవంబరు 11, శుక్రవారం అత్యంత ఆడంబరంగా, మిస్టర్ బిర్యానీ రెస్టారెంట్ ప్రారంభ కార్యక్రమం తానా మాజీ అధ్యక్షుడు జయరాం కోమటి చేతుల మీదగా జరిగింది.
అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న సన్నీవేల్ నగరంలో తాజాగా ప్రారంభించిన ఈ `మిస్టర్ బిర్యానీ` రెస్టారెంట్‌కు చాలా చరిత్రే ఉంది.
పాకశాస్త్రంలో ప్రావీణ్యులైన యువ వ్యాపారవేత్తలు కళ్యాణ్ కోట, స్వరూప్ వాసిరెడ్డిల ఆధ్వర్యంలో ఇప్పటికే అనేక రెస్టారెంట్లు అగ్రరాజ్యంలో తెలుగువారితో పాటు అటు అమెరికన్స్ ను కూడా మెప్పిస్తున్నాయి.
వారి జిహ్వాచాపల్యాన్ని తీరుస్తూ, పసందైన విభిన్న బిర్యానీలతో ఆకట్టుకుంటున్నాయి.
గతంలోనే తొలి ప్రయత్నంగా `మిస్టర్ బిర్యానీ`ని ఏర్పాటు చేసిన కళ్యాణ్ కోట, స్వరూప్ వాసిరెడ్డిలు, దీనికి అమోఘమైన రెస్పాన్స్ రావడం, దిగ్విజయంగా ముందుకు సాగుతుండడంతో తెలుగు వారి సంప్రదాయ రుచులను మరింత చేరువ చేయాలనే తలంపుతో, `భీమవరం రుచులు` రెస్టారెంట్‌ను బావార్చి శ్రీకాంత్ దొడ్డపనేనితో కలిసి ప్రారంభించారు.
పూర్తిగా ఆంధ్ర సంప్రదాయంతో కిచెన్ నుంచి వడ్డన వరకు ప్రత్యేకతలను చాటుకున్నారు.
ఈ పరంపరలోనే ఇటీవల కాలిఫోర్నియాలోని శాంటా క్లారాలో `అంబుర్ బిర్యానీజ్` పేరుతో అతిపెద్ద రెస్టారెంట్‌ను ప్రారంభించి, దిగ్విజయంగా నడుపుతున్నారు.
ఈ రెస్టారెంటుకు వచ్చిన రెస్పాన్స్, ఆహార ప్రియుల ఆదరణతో ఇప్పుడు మరో రెస్టారెంట్‌కు శ్రీకారం చుట్టారు – అదే `మిస్టర్ బిర్యానీ`!!
చికెన్, మటన్ బిర్యానీలతో పాటు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన `హైదరాబాద్ బిర్యానీ`ని కూడా విభిన్న రుచుల్లో అందిస్తున్నారు.
ధమ్ బిర్యానీ తో సహా అనేక రకాల బిర్యానీలను బాస్మతీ రైస్‌తో సిద్ధం చేసి బిర్యానీ ప్రియులను ఆకట్టుకుంటున్నారు.
ఈ ప్రారంభ కార్యక్రమం లో లక్ష్మణ్ పరుచూరి, సతీష్ బోళ్ల, తిరుపతి రావు సతీ సమేతంగా పాల్గొన్నారు.
స్థానిక ప్రముఖులు ప్రొఫెసర్ ఆంజనేయులు కొత్తపల్లి, రమేష్ తంగిళ్లపల్లి, శశి దొప్పలపూడి, మోహన్, విజయ్, వెంకట్ కోగంటి, గోకుల్ రాచిరాజు, భారత్ ముప్పురాళ్ల, బెజవాడ శ్రీను, సందీప్ ఇంటూరి, ఓమ్ ఇన్సూరెన్స్ అధినేత్రి అను ఆలిశెట్టి, హైమా రెడ్డి అనుమాండ్ల తదితరులు పాల్గొన్నారు.
మరి ఇంకెందుకు ఆలస్యం =తెలుగు వారి నేతృత్వంలో ఏర్పాటైన రెస్టారెంట్లో పసందైన బిర్యానీని రుచి చూసి ఆస్వాదించేందుకు బయలు దేరండి మరి!!