వైసీపీ ముఖ్యనాయకుడు, ప్రభుత్వ సలహాదారు.. సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు భార్గవ రెడ్డి త్వరలోనే రాజకీయ అరంగేట్రం చేయనున్నారా? ఆయనకు ఇప్పటికే ఎంపీ సీటును కూడాఖరారు చేశారా? అంటే.. ఔననే అంటున్నాయి వైసీపీ వర్గాలు. తాడేపల్లికి చెందిన కీలక నాయకులు ఇదే విషయాన్ని తాజాగా ప్రస్తావించారు. ప్రస్తుతం వైసీపీ ఐటీ విభాగం ఇంచార్జ్‌గా భార్గవ్ ఉన్నారు.
వైసీపీ ఐటీ విభాగం బాధ్యతలను విజయసాయిరెడ్డి నుంచి భార్గవర రెడ్డికి అప్పగించిన తర్వాత.. ప్రతిపక్షాలపై సోషల్ మీడియాలో విచక్షణ రహితంగా దారుణమైన బూతులతో దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి భార్గవ్‌కు సీటు విషయంపై గతంలోనే చర్చ జరిగింది. అయితే అప్పట్లో ఈ ప్రతిపాదనను సీఎం జగన్ వాయిదా వేశారు. కానీ, తాజాగా ఎన్నికలకు సమయం సమీపిస్తుండడంతో రాజకీయంగా ప్రాధాన్యం కల్పించాలని నిర్ణయించినట్టు తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి.
కర్నూలు లేదా.. కడప నుంచి రాఘవరెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వాలనేది ప్రాథమిక ఆలోచనగా ఉందని అంటున్నారు. కర్నూలు, కడపల్లో ఏది ఇచ్చినా గెలుపు ఖాయమనే నివేదికలు కూడా అందాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటారని, సామాజికంగా, ఆర్థికంగా కూడా తిరుగేలేని విధంగా సజ్జల ఉండడంతో తన కుమారుడిని ఎంపీగా చూసుకోవాలని ఆయన భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాఘవరెడ్డికి ప్రాధాన్యం ఇస్తున్నారనేది తాడేపల్లి వర్గాల టాక్.