రాష్ట్రంలో అన్న క్యాంటీన్లపై ప్రభుత్వం కక్షగట్టిన సంగతి తెలిసిందే. పేదవాడికి పట్టెడన్నం పెడతామంటూ ముందుకు వస్తున్న టిడిపి నేతలపై పోలీసు బలగాలని మోహరించి మరీ ప్రభుత్వం పగ సాధిస్తుంది. అన్నా క్యాంటీన్లని కూల్చివేసినప్పటికీ రోడ్డు పక్కన బల్లాలు వేసుకొని అన్నదానం నిర్వహిస్తున్న టిడిపి నేతలను సైతం పోలీసులు ఇబ్బంది పెడుతున్నారు. ప్రజలకు టిడిపి నేతలు ఏదో విషయం పెడుతున్నట్టుగా హుటాహుటిన వచ్చి పేదల నోటి కాడికి కూడును లాగేస్తున్నారు. ఈ క్రమంలోనే అన్న క్యాంటీన్ల కూల్చివేతలు, పోలీసుల వ్యవహార శైలిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఏపీ పోలీసులపై, జగన్ ప్రభుత్వం పై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.
పాలకుల ప్రాపకం కోసం తప్పులు చేసే పోలీసు అధికారులను ఎవరూ కాపాడలేరని రఘురామ వార్నింగ్ ఇచ్చారు. మరికొద్ది రోజుల్లో వైసిపి ప్రభుత్వం పడిపోతుందని, మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం లేదని పోలీసులకు రఘురామ గుర్తు చేశారు. పేదలకు అన్నం పెట్టాలని చూసే వారిపై హత్యాయత్నం కేసులు నమోదు చేస్తున్నారని, విజయవాడలో చెన్నుపాటి గాంధీ కన్ను తొలగించాలని చూసిన వారిపై నామమాత్రపు కేసులు పెట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారని మండిపడ్డారు. వివేక హత్యకేసు విచారణ చేస్తున్న సీబీఐ అధికారి రాంసింగ్‌ను కూడా వదల్లేదని, ఆయనపై కూడా ఏపీ పోలీసులు కేసులు నమోదు చేశారని అన్నారు.
అమరావతి రాజధానిని వైసీపీ నేతలు నిర్వీర్యం చేశారని, కనీసం పాదయాత్ర చేసుకుంటామంటే అనుమతి ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఆ పాదయాత్రకు ఏపీ డీజీపీ అనుమతి ఇవ్వకపోయినా హైకోర్టు అనుమతినిచ్చిందని చెప్పారు. భారతదేశ ప్రజల ప్రాథమిక హక్కులు కాపాడేలా తీర్పునిచ్చిన న్యాయమూర్తులకు అమరావతి రైతుల తరఫున శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని రఘురామ అన్నారు.
Comments 1