ఈ సారి గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్- ముస్లిం దోస్తీ ప్రధాన ప్రచారాస్త్రం అయ్యింది. గ్రేటర్ ప్రచారం సాగుతోంది. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం ఇచ్చిన జోష్ బీజేపీలో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. దీనికి తోడు.. గ్రేటర్ పోరులో గులాబీ బ్యాచ్ కు మజ్లిస్ మిత్రుడి స్నేహాన్ని హైలెట్ చేయటం తెలిసిందే. దీంతో.. ఎప్పుడూ లేనంతగా టీఆర్ఎస్ ఆత్మరక్షణలో పడిన పరిస్థితి. ఎప్పుడూ లేనట్లుగా.. ఛీ.. ఛీ.. మజ్లిస్ తో మిత్రత్వం ఏమిటి? అసలు అలాంటిదేమీ లేదని అనటమే కాదు.. ఈసారి చూడండి వారి స్థానాలే పది వరకు గెలవబోతున్నామన్న మాట మంత్రి కేటీఆర్ నోటి నుంచి రావటం గమనార్హం.
బీజేపీ చేస్తున్న ప్రచారం.. తమ మీద జరుగుతున్న దాడిగా గులాబీ నేతలు భావిస్తున్నారు. దీంతో మజ్లిస్ రంగంలోకి దిగింది. బీజేపీని టార్గెట్ చేస్తూ ఘాటు వ్యాఖ్యలు మొదలు పెట్టింది. దీనికి సమాధానం అన్నట్లుగా మరింత చెలరేగిపోయిన బండి సంజయ్.. పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్ అంటూ చేసిన వ్యాఖ్య పెను సంచలనానికి తెర తీయటమే కాదు.. దాని పైనే ఇప్పుడు చర్చంతా సాగుతోంది.
ఇలాంటివేళ.. మజ్లిస్ అధినేత అసద్ నోటి నుంచి వచ్చిన ఒక తీవ్ర వ్యాఖ్య ఇప్పుడు మరో వికారపువ్యాఖ్యకు కారణమైంది. గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారానికి జాతీయ స్థాయి నేతల్ని కూడా తీసుకొస్తోంది బీజేపీ. దీంతో.. తమ వారికి దన్నుగా నిలవటంతో పాటు.. హైదరాబాద్ స్థానిక ఎన్నికల అంశాన్ని బీజేపీ అధినాయకత్వం ఎంత సీరియస్ గా తీసుకుంటుందనన విషయాన్ని చెప్పకనే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ ప్రయత్నాలకు ఒళ్లు మండిన అసద్.. బ్యాలెన్స్ కోల్పోయారు. అనకూడని మాటను అనేశారు. ‘రానివ్వండి.. రానివ్వండి హైదరాబాద్ కు. వారు అసహనానికి గురవుతున్నారు. వారికి మన అల్ – హమ్దుల్లా బిర్యానీ తినిపిద్దాం’ అంటూ దారుణ వ్యాఖ్య చేశారు. దీనిపై తీవ్ర ఆగ్రహానికి గురైన గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందిస్తూ.. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీకి పంది బిర్యానీ తినిపిస్తామని అన్నారు.
దీంతో.. ఇరువురు నేతల మధ్య మాటల యుద్ధం.. తీవ్రంగా మారిందని చెప్పాలి. ఈ ఎపిసోడ్ ను చూస్తే.. బీజేపీ నేతలపై విమర్శలు చేయటానికి మాటలు లేనట్లుగా అసద్ చేసిన వ్యాఖ్య ఇప్పుడు పలువురిని ఆగ్రహానికి గురి చేసేలా ఉంది. ఇదంతా చూస్తే.. అసద్ టైం గయా… బీజేపీ టైం ఆగయా అన్నట్టు మారుతోంది పరిస్థితి.