తెలంగాణ బిజెపికి మరో ఎదురుదెబ్బ తగిలింది దళిత వర్గానికి చెందిన సీనియర్ నాయకులు, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు..ఈటలపై తీవ్ర ఆరోపణలు ఆరోపణలు చేస్తూ బీజేపీకి మోత్కుపల్లి నర్సింహులు రాజీనామా చేశారు.
ఎస్సీ వర్గాల భూములు ఆక్రమించుకున్న ఈటెల రాజేందర్ ను పార్టీలో చేర్చుకోవడం నచ్చక పార్టీ బీజేపీ కి రాజీనామా చేస్తున్నట్లు మోత్కుపల్లి నర్సింహులు వ్యాఖ్యానించడం గమనార్హం.
అయితే, మోత్కుపల్లి రాజీనామా వెనుక కేసీఆర్ ఉన్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. రేవంత్ రెడ్డి సీక్రెట్లను తెలుసుకోవడం ద్వారా మరింతగా రేవంత్ అడ్డుకట్ట వేయడానికి మోత్కుపల్లి పనికొస్తాడని భావించడం ఒకటి.
రెండోది ఈటెలను విమర్శించడానికి మోత్కుపల్లిని వాడుకోవచ్చు అని భావించడం. వాస్తవానికి 2018 లనే మోత్కుపల్లి నర్సింహులు తెరాస లోకి పోదాం అనుకుంటే వాళ్ళు తీసుకోలేదు. ఇప్పుడు ఈటెల ను విమర్శించడానికే నిన్ను తెరాస లోకి తీసుకుంటున్నారు ఈ విషయం లో దళితుల ను మాత్రం వాడుకోకు… దళితులకు అన్యాయం చేసిన కేసీఆర్ కోసం దళితులకు అన్యాయం చేయకు అంటున్నాయి దళితసంఘాలు.
అది సరే.. మరిపుడు మోత్కుపల్లి టీఆర్ఎస్ లోకి ఎంట్రీ ఇస్తే ఏ పదవి దక్కుతుందో మరి. ఎమ్మెల్సీ టిక్కెట్ అయినా వస్తుందా రాదా?
బీజేపీ లోకి మోత్కుపల్లి!
అమిత్ షా సమక్షంలో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. pic.twitter.com/2wZTvC2B42— Tolivelugu Official (@Tolivelugu) November 4, 2019
అమిత్ షా ఆహ్వానించిన రెండేళ్లకే బీజేపీ నుంచి అవుట్. పై చిత్రం బీజేపీలోకి జాయిన్ అయినప్పటి దృశ్యం.