ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలలో ఒకటి మీడియా ప్రపంచం, అందులోను విజువల్ మీడియా. గతంలో కంటే ఎక్కువగా మహిళలు ఈ రంగంలోకి ప్రవేశిస్తున్నారు. విజయవంతమైన జర్నలిస్ట్ కావడం చాలా మంది అమ్మాయిలకు పెద్ద కల. ఆ మాటకొస్తే అబ్బాయిల కంటే అమ్మాయిల్లోనే నిజాయితీ పరులైన జర్నలిస్టులు కూడా ఎక్కువట.
ఇవన్నీ పక్కన పెడితే… జర్నలిజంలో అందం ప్రామాణికం కాకపోయినా మారుతున్న కాలంలో విజువల్ జర్నలిజంలో అందం ఒక అదనపు ఆకర్షణగా అనిపిస్తోంది. ఆ కోణంలో సరదాగా ఒక సారి అందమైన జర్నలిస్టులు ఎవరా అని వెతికితే చాలామందే కనిపించారు. అందులో ఎక్కువ పాపులర్ అయిన 5 మంది వివరాలు ఇక్కడ ఇస్తున్నాం.
సాధారణంగా బ్యూటీ విత్ బ్రెయిన్స్ అంటే… జర్నలిజంలో దాన్ని కొంచెం మార్చి బ్యూటీ విత్ డేర్ అనొచ్చేమో. వారెవరో కొంచెం చూద్దామా…
శైలీ చోప్రా (Shaili Chopra- ET Now)
శైలీ చోప్రా ఒక బిజినెస్ జర్నలిస్ట్. ఎకనకిమ్ టైమ్స్ లో పనిచేస్తారు. రచయిత కూడా. గతంలో ఆమె ఎన్డిటివి-ప్రాఫిట్ లోను పనిచేశారు. బిజినెస్ జర్నలిజంలో ఎక్సలెన్స్ కోసం 2012 రామ్‌నాథ్ గోయెంకా అవార్డును గెలుచుకున్నారు.
రుబికా లియాఖత్ (Rubika Liyaquat- ABP News)
రుబికా లియాఖత్ ఇండియన్ న్యూస్ యాంకర్, ప్రెజెంటర్ మరియు జర్నలిస్ట్. ఆమె ఉదయపూర్‌లో ఛానల్ 24 తో జర్నలిజంలో తన వృత్తిని ప్రారంభించింది. 2008 లో, ఆమె న్యూస్ 24 లో యాంకర్ మరియు సీనియర్ కరస్పాండెంట్ గా చేరారు. ఆమె ముంబై విశ్వవిద్యాలయం నుండి విద్యను పూర్తి చేసింది. ప్రస్తుతం, ఆమె ఎబిపి న్యూస్‌తో కలిసి పనిచేస్తోంది.
చిత్ర త్రిపాఠి (Chitra Tripathi- ABP News)
చిత్ర ప్రముఖ జర్నలిస్ట్, స్క్రిప్ట్ రైటర్ మరియు నిర్మాత. ఆమె తన కెరీర్‌ను జర్నలిజంలో ఎబిపి న్యూస్ ఛానెల్‌తో ప్రారంభించింది. ఎబిపి న్యూస్‌లో చేరడానికి ముందు, ఆమె దూరదర్శన్, ఇండియా న్యూస్, సహారా ఇండియా, న్యూస్ 24, మరియు ఇటివి నెట్‌వర్క్‌లతో కలిసి పనిచేసింది. ఆమె తన విద్యను దీన్ దయాల్ ఉపాధ్యాయ నుండి పూర్తి చేసింది. గోరఖ్‌పూర్ విశ్వవిద్యాలయం నుంచి పట్టా పొందారు.
కుంకుమ్ బిన్వాల్ (Kumkum Binwal- ABP News)
కుంకుమ్ బిన్వాల్ ఒక నిష్పాక్షిక పాత్రికేయురాలిగా పేరుపొందారు. టీవీ జర్నలిజంతో ఆమెకు చాలా కాలం అనుభవం ఉంది. కుంకుమ్ కెరీర్ ఢిల్లీకి చెందిన ప్రాంతీయ వార్తా ఛానెల్ అయిన టోటల్ టీవీలో ప్రారంభం అయ్యింది. తరువాత, ఆమె ఆజ్ తక్ టీజ్‌లో చేరింది, అక్కడ నుండి ఎబిపి న్యూస్ లో ప్రస్తుతం పనిచేస్తున్నారు.
ప్రతిమ మిశ్రా ( Pratima Mishra- ABP News)
ప్రతిమ మిశ్రా భారతీయ జర్నలిస్ట్ మరియు వ్యాఖ్యాత. ఆమె ఎబిపి న్యూస్ లో అత్యంత ప్రజాదరణ పొందిన గ్రౌండ్ రిపోర్టర్లలో ఒకరు. ఆమె ‘నమస్తే భారత్’ పేరుతో ఎబిపి న్యూస్ యొక్క కొన్ని గంటల నిడివి గల ఉదయం బులెటిన్ షోను ఎక్కువగా నిర్వహిస్తోంది. ప్రతిమా మిశ్రా 2012 నుండి ఈ సంస్థతో కలిసి పనిచేస్తోంది. ఢిల్లీ గ్యాంగ్ రేప్ కవరేజీ సమయంలో ఆమెకు ఎక్కువ పేరొచ్చింది. ఆమె స్పాట్ కవరేజీకి మంచి పేరుంది. ఆమె 2017 లో జర్నలిజంలో ఎక్సలెన్స్ కోసం ప్రతిష్టాత్మక రామ్‌నాథ్ గోయెంకా అవార్డును కూడా గెలుచుకుంది. ప్రతిమా మిశ్రా ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని మహారాజా అగ్రసేన్ కళాశాల నుండి జర్నలిజంలో పట్టభద్రురాలయ్యారు.